Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలీవుడ్‌లో బీభత్సమైన క్రేజ్ సాధించిన శ్రుతి హాసన్ చెల్లెలు అక్షర... ఏం చేసిందో తెలుసా?

కాటమరాయుడు చిత్రం సక్సెస్ టాక్ తో శ్రుతి హాసన్ ఓవైపు ఖుషీగా వుంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె చెల్లెలు అక్షర హాసన్ కూడా తనదైన స్టయిల్లో దూసుకుపోతుందట. షమితాబ్ చిత్రంలో నటించినప్పటికీ ఆమెను పెద్ద

Advertiesment
akshara hassan
, శుక్రవారం, 24 మార్చి 2017 (15:35 IST)
కాటమరాయుడు చిత్రం సక్సెస్ టాక్ తో శ్రుతి హాసన్ ఓవైపు ఖుషీగా వుంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె చెల్లెలు అక్షర హాసన్ కూడా తనదైన స్టయిల్లో దూసుకుపోతుందట. షమితాబ్ చిత్రంలో నటించినప్పటికీ ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ తన తాజా చిత్రం లాలీ కీ షాదీ మే లడ్డూ దీవానా ద్వారా త్వరలో బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైన తన లక్ ఏంటో పరీక్ష చేసుకోబోతోంది. ఈ నేపధ్యంలో ఆమె వీలున్నప్పుడల్లా పరిచయాలు పెంచుకుంటుంది.. పరిచయాలు పెంచుకోవడం అంటే మీడియాకు ఇంటర్వ్యూలు గట్రా వంటివి ఇవ్వడం అన్నమాట. ఈ క్రమంలో తన ఆరోగ్యం సరిగా లేకపోయినా మీడియా సమావేశానికి వచ్చిందట. 
 
హీరోయిన్... అందునా సెక్సీ నటి... మాట్లాడుతుంటే విలేకరులు ప్రశ్నలు వేస్తూనే వున్నారట. మీడియా జనం ఒక్కొక్కరు వేస్తున్న ప్రశ్నలకు అక్షర ఓపిగ్గా సమాధానాలు చెపుతూనే వుందట. కానీ విలేకరులు మాత్రం తమ ప్రశ్నల పరంపరను ఆపలేదట. ఇంకా.. ఇంకా అంటూ ఏవేవో ప్రశ్నలు అడుగుతూనే వున్నారట. దీనితో ఒక దశలో అసహననానికి లోనై.... ఇక నేను వెళ్తానంటూ లేచిందట. దాంతో విలేకరులు.. మేడం, ఇంకా అడగాల్సినవి చాలా వున్నాయంటూ ఆమెకు అడ్డు తగిలారట. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసి కేకలు వేసిందట. 
webdunia
 
ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన వ్యక్తిపై కూడా మండిపడిందట. ఆ తర్వాత సారీ చెప్పిందట. కానీ ఈ విషయాన్ని పట్టుకుని బాలీవుడ్ మీడియా ఏవేవో రాతలు రాస్తోందట. ఏం రాతలు రాశారో కానీ చిత్రానికి మంచి పబ్లిసిటీ దొరికిందనీ, అలాగే ఆమె పేరు కూడా ఒక్కసారిగా పాపులర్ అయిందని సినీజనం చెప్పుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ ఓ పెద్ద ఫ్లాప్ హీరోనే కాదు.. బడా ఛీటర్ కూడా : సినీ విమర్శకుడు కేఆర్కే