Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుస ఫ్లాప్ డైరెక్టరుతో సినిమా చేస్తానంటున్న అఖిల్.. ఎందుకు?

Advertiesment
వరుస ఫ్లాప్ డైరెక్టరుతో సినిమా చేస్తానంటున్న అఖిల్.. ఎందుకు?
, గురువారం, 4 ఏప్రియల్ 2019 (19:23 IST)
మొత్తంమీద అఖిల్ అప్‌కమింగ్ సినిమాపై అఫిషియల్‌గా కన్ఫామ్ అయిపోయింది. అయితే ఫస్ట్ మూవీ నుంచి లేటెస్ట్ మిస్టర్ మజ్ను వరకు ఒక్క హిట్ లేకుండా బాధపడుతున్న అఖిల్ ఎవరి డైరెక్షన్‌కు ఓకే చెప్పారు. ఏ మూవీ మేకర్ వర్క్ చేయబోతున్నాడు. అసలు ఈ మూవీ అయినా అఖిల్‌కు సక్సెస్ ఇస్తుందా. 
 
అక్కినేని అఖిల్‌కు హిట్ అందుకోవడమే అతి కష్టమవుతోంది. ఫస్ట్ మూవీ అఖిల్‌తో మిరాకిల్ చేద్దామని ఆశపడ్డాడు. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిసాస్టర్ టాక్‌తో ఢీలా పడింది. ఇక సెకండ్ మూవీ హలోతో సక్సెస్‌కి హలో చెప్పాలనుకున్నాడు. విక్రమ్ కుమార్ హిట్ డైరెక్టర్‌తో సినిమా కావడంతో ఈ సినిమా పక్కా సక్సెస్ అనుకున్నారు అక్కినేని అభిమానులు. కానీ ఆ చిత్రం కూడా అఖిల్‌కు కలిసి రాలేదు. ఇక లేటెస్ట్‌గా వచ్చిన మూడవ చిత్రం మిస్టర్ మజ్ను కూడా ఆశించినంత భారీ హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో అఖిల్ నాలుగో చిత్రాన్ని ఎవరు టేకప్ చేస్తారు ఏ డైరెక్టర్ ఒకే చెబుతారని అనుకున్నారంతా.
 
మొత్తానికి ఆ ఎదురుచూపులు తెరపడినట్లు అనిపిస్తోంది. అఖిల్ 4వ మూవీపై అఫిషియల్ అనౌస్మెంట్ రానుంది. బొమ్మరిల్లు చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్టయిన భాస్కర్‌తో అఖిల్ నెక్ట్స్ మూవీ తెరకెక్కబోతోంది. బొమ్మరిల్లు, పరుగు లాంటి హిట్ చిత్రాల ద్వారా ఆరెంజ్ మూవీతో ఓ రేంజ్ ఫ్లాప్ అందుకున్నారు భాస్కర్. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని ఒంగోలు గిత్త సక్సెస్‌తో ముందుకు వద్దామనుకున్నాడు. కానీ ఆ సినిమా కూడా ఫెయిలయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు అఖిల్ మూవీ సినిమాకు ఓకే చెప్పారట భాస్కర్.
 
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. వి.వి. వినాయక్ లాంటి టాప్ డైరెక్టరే హిట్ ఇవ్వలేకపోయారు. వెంకీ అట్లూరి లాంటి డైరెక్టర్లు కూడా అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయారు. అలాంటిది వరుస ఫ్లాప్‌లతో ఉన్న భాస్కర్ విజయం ఇస్తారో లేదోనన్నది ఆశక్తికరంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌ర్మ ట్వీట్‌పై తెదేపా నాయకులు గరంగరం... ఎందుకు?