Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అఖిల్‌ను వెంటాడుతున్న దురదృష్టం... రెండో చిత్రానికి అడ్డంకులు?

అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని. ఈ యువ హీరో "అఖిల్" చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాఫ్ అయింది. దీంతో అఖిల్ తీవ్ర నిరుత్సాహానికి గుర

అఖిల్‌ను వెంటాడుతున్న దురదృష్టం... రెండో చిత్రానికి అడ్డంకులు?
, ఆదివారం, 9 జులై 2017 (14:24 IST)
అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని. ఈ యువ హీరో "అఖిల్" చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాఫ్ అయింది. దీంతో అఖిల్ తీవ్ర నిరుత్సాహానికి గురైంది. దీంతో తన రెండో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. 
 
అయితే, ఈ సినిమాకు అడుగ‌డుగునా అవాంత‌రాలు ఎదుర‌వుతున్న‌ట్టు తెలుస్తుంది. ఎప్పుడో మొద‌లవుతుంద‌నుకున్న ఈ సినిమా ద‌ర్శ‌కుల మార్పుల‌తో తీవ్రజాప్యం జరిగింది. ఫైన‌ల్‌గా 'మ‌నం' ఫేం విక్ర‌మ్ కుమార్ పేరును ఖరారు చేశారు. ప్రయోగాత్మక మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శకుడు భావించాడు. 22 ఏళ్ళ యువ‌కుడి మ‌ర‌ణం ఈ చిత్ర కథ సాగనుంది. 
 
అయితే ఇదే స్టోరీతో తాజాగా "రెండు రెళ్ళ ఆరు" అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్ర కథకు, అఖిల్ కోసం ఎంచుకున్న కథకు పోలికలు ఉండటంతో దర్శకుడు స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో అఖిల్ చిత్రం మరికొంత కాలం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెట్‌లో రజనీ హీరోయిన్ టాప్‌లెస్ ఫోటోల వైరల్...