Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గాలి కూతురి పెళ్ళిని తలదన్నే విధంగా అక్కినేని అఖిల్ వివాహం.. రోమ్‌లో పెళ్లి.. భారీ ఖర్చు?

అక్కినేని అఖిల్-జీవీకే అధినేత జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి జీవీకే హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రెండు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహ

Advertiesment
Akhil Akkeneni engagement function with Shirya Bhupal Naga Chaitanya and Samantha
, శనివారం, 10 డిశెంబరు 2016 (17:36 IST)
అక్కినేని అఖిల్-జీవీకే అధినేత జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి జీవీకే హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రెండు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వారిలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఉన్నారు. కాగా అఖిల్-శ్రియల వివాహం రోమ్‌లో జరగనుంది. అయితే ఈ పెళ్లి భారీ ఖర్చుతో జరుగనుందని టాలీవుడ్‌లో టాక్ వస్తోంది. 
 
మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కూతురు వివాహ వార్తలతో ఇప్పటికే మీడియా షేక్ అవుతుంటే.. అఖిల్ పెళ్లి అంతకంటే అట్టహాసంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గాలి పెళ్లికి పెట్టిన ఖర్చు కంటే.. అక్కినేని అఖిల్‌కి కాబోయే అత్త మామ గారు ఎక్కువే పెట్టాలనుకుంటున్నారు. ఆ హంగామా చూస్తుంటే గాలి వారి వివాహం తేలిపోతుందటున్నారు నెటిజన్స్. 
 
ఎంగేజ్ మెంట్ సింపుల్‌గా తక్కువ మందిని ఇంటివైట్ చేసి జరిపారు. ఇటలీలోని రోమ్‌లో అఖిల్-శ్రేయాల వివాహం జరుగనుంది. దీనిని డెస్టినేషన్ మ్యారేజ్ అంటరాని.. ఫారెన్‌లో ఇలాంటి తరహా మ్యారేజీలు సహజమని.. ఇండియాలో అఖిల్ మ్యారేజ్‌తో మొదలవుతుందని టాలీవుడ్ జనం అంటున్నారు. 
 
ఇకపోతే.. ఇటలీలో అఖిల్ పెళ్లి ఖర్చు బాగానే పెరిగేట్టు వుంది. ప్లైట్ చార్జీలు, హోటళ్లు, అతిథులకు ఆహ్వానంతో పాటు, విందు- వినోదాలు అధికంగానే వ్యయం కానుంది. ఐతే ఈ ఖర్చంతా అఖిల్‌కు కాబోయే మామగారే భరించనున్నారని సమాచారం. అఖిల్‌కు కాబోయే భార్య ప్రముఖ వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి (జీవీకే) మనవరాలు శ్రీయా భూపాల్‌. వీరికి వేల కోట్లల్లో ఆస్తులు ఉన్నాయని, ఇటలీలో ఒక హోటల్‌తో వారికి కాంటాక్ట్స్ ఉండటంతో పెళ్ళంతా అక్కడే జరిపేయాలని రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సో.. గాలి కూతురి వివాహం కంటే అఖిల్ వివాహం అట్టహాసంగా జరుగనుందన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్లాక్ అండ్ వైట్ చందమామ.. బ్లాక్ అండ్ వైట్‌లో ఆత్మ కనిపిస్తుంది.. కలర్ ఫోటోలో?