Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజమౌళి మహాభారతం ప్రాజెక్టు ఖాయం! నటీనటులు వీరే.. కర్ణుడిగా మహేష్ బాబు?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'మహాభారత' కథను వెండితెరపై ఆవిష్కరించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు టీజర్ కూడా హల్ చల్ చేస్తోంద

Advertiesment
SS Rajamouli
, గురువారం, 11 మే 2017 (14:09 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'మహాభారత' కథను వెండితెరపై ఆవిష్కరించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు టీజర్ కూడా హల్ చల్ చేస్తోంది. మహాభారతంలో నటీనటులను కూడా రాజమౌళి ఎంపిక చేశారనీ ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ మహాభారతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అమీర్ ఖాన్, అజయ్ దేవగణ్, హృతిక్ రోషన్, ప్రభాస్, మహేష్ బాబు, ఫర్హాన్ అఖ్తర్, దీపికా పదుకునే నటించనున్నారని ఈ టీజర్‌లో చెబుతోంది. 
 
నిజానికి తాను ఇప్పట్లో మహాభారతంను తెరకెక్కించడం లేదని, అందుకు చాలా సమయం పడుతుందని దర్శకుడు రాజమౌళి ఓపక్క చెబుతూనే ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం మరోలా ఉంది. ఇదిలావుంటే సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం మేరకు.. రాజమౌళి చేపట్టే మహాభారతంలో పాత్రలకు నటీనటుల ఎంపికలను పరిశీలిస్తే...
 
శ్రీకృష్ణుడిగా అమీర్ ఖాన్, భీష్ముడిగా అమితాబ్ బచ్చన్, దుర్యోధనుడిగా అజయ్ దేవగణ్, కర్ణుడిగా హృతిక్ రోషన్ లేదా మహేష్ బాబు, అర్జునుడిగా ఫర్హాన్ అఖ్తర్, భీముడిగా ప్రభాస్, ద్రోణాచార్యుడిగా రజనీకాంత్, ద్రౌపదిగా దీపికా పదుకునే తదితరులు నటించనున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన టీజర్ ఒకటి వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్యాన్స్‌తో రజనీకాంత్ భేటీ.. నగ్మా పిలుపు.. రాజకీయాల్లో రజనీ కాంత్?