Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐశ్వర్యరాయ్ చిత్రంలో పాకిస్థాన్ నటుడు... చిత్రాన్ని విడుదల చేస్తే థియేటర్లు బద్ధలవుతాయ్... వార్నింగులు

ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌ నటీనటులు వెంటనే భారత్‌ వదిలి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ కళాకారులు తీవ్రవాదులు కారని, వారికి పాక్‌ నుంచ

ఐశ్వర్యరాయ్ చిత్రంలో పాకిస్థాన్ నటుడు... చిత్రాన్ని విడుదల చేస్తే థియేటర్లు బద్ధలవుతాయ్... వార్నింగులు
, శనివారం, 15 అక్టోబరు 2016 (13:06 IST)
ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌ నటీనటులు వెంటనే భారత్‌ వదిలి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ కళాకారులు తీవ్రవాదులు కారని, వారికి పాక్‌ నుంచి భారత్‌ వచ్చేందుకు వీసాలు, అనుమతులు ప్రభుత్వమే ఇస్తుందని శుక్రవారం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కళాకారుల్ని, తీవ్రవాదుల్ని ఒకేలా చూడవద్దన్నారు. ఈ విషయంపై రాధికా ఆప్టే తదితర సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను చెప్పారు.
 
యురీ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్థాన్ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, సంగీత దర్శకులు పనిచేసే సినిమాలపై సీవోఈఏఐ ( సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నిషేధం విధించింది. దేశభక్తిభావం, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని సీవోఈఏఐ అధ్యక్షుడు నితిన్ దతర్ తెలిపిన విషయం తెలిసిందే. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో ఐశ్వర్యరాయ్, రణబీర్, అనుష్క ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన యే దిల్ హై ముష్కిల్ చిత్రం చిక్కుల్లో పడింది. అసలు విషయం ఏంటంటే...ఈ చిత్రంలో పాక్‌ నటుడు ఫవాద్‌ఖాన్‌ నటించాడు. ఈ నేపథ్యంలో దీపావళికి విడుదల కానున్న ఈ చిత్రాన్ని పలు రాష్ట్రాల్లోని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌ యజమానులు పాక్‌ నటీనటులున్న సినిమాలను ఆడనివ్వమని తేల్చిచెప్పేశారు.
 
దీంతో చాలా థియేటర్లలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో కరణ్‌ తలపట్టుకున్నాడు. ఈ విషయమై ఉగ్రవాదానికి పాక్‌ నటీనటులకు సంబంధం లేదని వారిని భారత్‌ నుంచి వెళ్లగొట్టినంత మాత్రాన ఉగ్రవాదం ఆగదని కరణ్‌ ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధనుష్ పాట పాడితే ''తట్టుకోలేకపోతున్నాం'' : యువన్‌ శంకర్‌రాజా