Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భయంకర వ్యాధితో నటి త్రిష చనిపోయిందట.. సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రచారం

చెన్నై చిన్నది హీరోయిన్ నటి త్రిషను నెటిజన్లు చంపేశారు. కలలో కూడా ఎవరూ ఊహించడానికి ఇష్టపడని ఓ భయంకర వ్యాధి బారిన పడి త్రిష గత గురువారంనాడు కన్నుమూసిందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రకటించడం సంచల

భయంకర వ్యాధితో నటి త్రిష చనిపోయిందట.. సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రచారం
, శనివారం, 14 జనవరి 2017 (10:08 IST)
చెన్నై చిన్నది హీరోయిన్ నటి త్రిషను నెటిజన్లు చంపేశారు. కలలో కూడా ఎవరూ ఊహించడానికి ఇష్టపడని ఓ భయంకర వ్యాధి బారిన పడి త్రిష గత గురువారంనాడు కన్నుమూసిందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రకటించడం సంచలనమైంది. జల్లికట్టు పోటీల కోసం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పోటీ నిర్వహణకు సుప్రీంకోర్టు కళ్లెం వేసివుండగా, కేంద్రం కూడా తమకేం పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తోంది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పొగరుబోతు ఎద్దులను చిత్రహింసలకు గురిచేసే జల్లికట్టు పోటీలు వద్దనే వద్దంటూ నటి త్రిష కామెంట్స్ చేసింది. ఇది తమిళ ప్రజలతో పాటు.. జల్లికట్టు నిర్వాహకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
 
ఆ వెంటనే తమ ఆగ్రహాన్ని చాటుకునేందుకు కారైకుడి డౌన్‌టౌన్‌లో ఆమె నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ను ఆందోళనకారులు అడ్డుకుని త్రిషకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అంతటితో ఆగ్రహం చల్లారని కొందరు త్రిష అంతుచిక్కని వ్యాధితో చనిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రకటించేశారు. అయితే త్రిష అభిమానులు మాత్రం 'పెటా' టీ-షర్ట్ ధరించిన త్రిష ఫోటో రెండేళ్ల క్రితం నాటిదని, మూగజీవాల సంరక్షణ పట్ల ఆమెకు అభిమానం ఉన్నప్పటికీ జల్లికట్టు క్రీడను వ్యతిరేకిస్తూ ఆమె ఇటీవల కాలంలో ఎలాంటి ప్రకటన చేయలేదని వివరణ ఇచ్చారు. ఏదిఏమైనా త్రిష చనిపోయిందంటూ నెటిజన్లు ప్రకటించడం ఆమె అభిమానులను మాత్రం కలవరానికి గురిచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి "ఖైదీ"ని చూసిన పవన్ కళ్యాణ్... 'చిరంజీవినా మజకా' అంటూ కామెంట్స్!