Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నన్ను ముంచేశాడు.. టాలీవుడ్ కంజూష్‌గాళ్లు... తాప్సీ సంచలన కామెంట్స్

టాలీవుడ్‌లో యాపిల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన తాప్పీ. ఒకపుడు.. మంచు ఫ్యామిలీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఆ తర్వాత అవకాశాలు లేక వెండితెరకు దూరమైంది. ఆ తర్వాత కృష్ణవంశీ 'మొగుడు'

Advertiesment
నన్ను ముంచేశాడు.. టాలీవుడ్ కంజూష్‌గాళ్లు... తాప్సీ సంచలన కామెంట్స్
, సోమవారం, 26 డిశెంబరు 2016 (15:09 IST)
టాలీవుడ్‌లో యాపిల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన తాప్పీ. ఒకపుడు.. మంచు ఫ్యామిలీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఆ తర్వాత అవకాశాలు లేక వెండితెరకు దూరమైంది. ఆ తర్వాత కృష్ణవంశీ 'మొగుడు' వంటి సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత కొంతమంది తెలుగు హీరోలతో కలిసి స్క్రీన్‌పై గ్లామర్ ఫీస్ట్ చేసింది. 
 
అంతలా తన అందచందాలను ప్రదర్శించినప్పటికీ... తెలుగు సినిమాల్లో కలిసి రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ "పింక్" మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. తాప్సీ బిగినింగ్ నుంచి కాంట్రవర్షియల్ కామెంట్లు చేస్తూనే ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ.. తనలో యాక్షన్ పార్ట్ గమనించకుండా కేవలం స్కిన్ షో కోసమే వినియోగిస్తోందంటూ గతేడాది హాట్ కామెంట్స్ చేసింది కూడా. 
 
మళ్లీ ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో టాలీవుడ్‌పై విమర్శలు గుప్పించింది. "టాలీవుడ్ కంజూష్ గాళ్లంటూ" ఎక్కిదిగింది. తనను సినిమాకు తీసుకుని రెమ్యూనరేషన్ సరిగా ఇవ్వకుండా మోసం చేశారంటూ టాలీవుడ్‌ని దుయ్యబట్టింది. అంతేకాకుండా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రొడ్యూసర్ నకిలీ చెక్కులిచ్చాడని, డబ్బింగ్ కూడా తనతోకాకుండా వేరే ఆర్టిస్ట్‌తో చెప్పంచుకున్నారనీ, ఇలా తనను దక్కాల్సిన మనీ అందలేదంటూ వాపోయింది. కానీ మోసం చేసిన ప్రొడ్యూసర్ పేరు మాత్రం బయటకు చెప్పకపోవడం విశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైతూతో క్రిస్మస్ ట్రిప్‌లో సమంత అందాల ఆరబోత.. ఆగస్టు 29న చైతూ-శామ్స్ నిశ్చితార్థం..?