Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చలపతి బాబాయ్ కొవ్వుతోనో, కామంతోనో అన్లేదు: నటి అపూర్వ

అమ్మాయిలు హానికరం కాదుగానీ, పక్కలోకి పనికివస్తారంటూ సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌నే కాదు.. మహిళా లోకాన్ని సైతం ఓ కుదుపు కుదిపాయి. దీనిపై సినీ నటి అపూర్వ స్పందించారు.

Advertiesment
చలపతి బాబాయ్ కొవ్వుతోనో, కామంతోనో అన్లేదు: నటి అపూర్వ
, ఆదివారం, 28 మే 2017 (09:16 IST)
అమ్మాయిలు హానికరం కాదుగానీ, పక్కలోకి పనికివస్తారంటూ సీనియర్ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌నే కాదు.. మహిళా లోకాన్ని సైతం ఓ కుదుపు కుదిపాయి. దీనిపై సినీ నటి అపూర్వ స్పందించారు. 
 
'చలపతి బాబాయ్ వ్యక్తిగా చాలా మంచివారు. మాకు చాలా మంచి విషయాలు చెప్పేవారు. అందరికీ మంచి వాఖ్యాలే చెబుతారు. కాకపోతే దాన్ని కొంచె ఫన్నీగా చెబుతారు. 'షాకింగ్ న్యూస్ ఏంటంటే... సూసైడ్ అటెంప్ట్ చేసిన చలపతిరావు'. నాకు కళ్లలో నీళ్లు వచ్చాయండి. ఎందుకంటే బాబాయ్ నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ అమ్మాయితోనైనా మిస్ బిహేవ్ చేయలేదు. ఇండస్ట్రీలో ఒక్క అమ్మాయితోనైనా మీరు చెప్పించండి. అప్పుడు నేను మాటలు పడతాను. ఎందుకంటే బాబాయ్ అలాంటోడు కాదు. నలుగురిలో ఉన్నప్పుడు ఫన్ కావాలి అంతే. సరదాగా అందరిమీద సెటైర్ వేస్తారు. ఈరోజు ప్రతిఒక్కరూ ఆయన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయనను బాయ్‌కాట్ చేసేయండి.. ఇండస్ట్రీ నుంచి తరిమేయండి అంటున్నారు. ఆయనేం టెర్రరిస్ట్ కాదండి. బాబాయ్ అన్నది తప్పే. ఒప్పుకుంటా. బాబాయ్ మంచోడు. కానీ, బాబాయ్ మాట్లాడింది తప్పే.
 
ఏమండీ.. యాంకర్‌ది తప్పులేదా ఆరోజు. యాంకర్ ఆడపిల్లే. ఆ ప్రశ్న అడగాల్సినంత అవసరం ఏంటండి? నేను అప్పుడే అనుకున్నాను.. ఆ అమ్మాయ్ మైకు పట్టుకొస్తోంది.. అంకుల్ ఏమనేస్తారో అని. టప్‌మని అనేశారాయన. కాకపోతే మా బాబాయ్ మాత్రం కొవ్వుతోనో, కామంతోనో అట్లా మాట్లాడలేదండి. ఆయన మాట్లాడిందొక్కటే.. నోరు జారాడు అంతే. మా బాబాయ్ మాకు దేవుడండి. ఇప్పటికీ చెబుతున్నా.. ఇండస్ట్రీలో ఎవరినైనా అడగండి.. ఆయన ఎవరినైనా అమ్మాయిని పిలిచాడా? అని. ఎంతో మంది తాతల ఏజ్ ఉండి.. పక్కన అమ్మాయిలను కూర్చొబెట్టుకుని, వాళ్ల మీద చేతులు వేస్తూ.. మధ్యాహ్నం బ్రేక్‌లో రూమ్‌లకు రమ్మని పిలిచేవాళ్లు చాలామంది ఉన్నారండి. వాళ్లందరితో పోల్చితే మా అంకుల్ దేవుడండి. తెలియనివాళ్లు కూడా ఆయన గురించి మంచిగా చెబుతున్నారు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఎందుకు రారండి. వాళ్లు కూడా వచ్చి ఆయన సెన్స్ ఇది కాదు అని చెబితే నాకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది కదా' అని ఉద్వేగంతో అపూర్వ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై ''సూపర్'' అనే పదమే వాడనన్న రవి- చలపతిరావును చంపేయండన్న రవిబాబు