Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జర్నీ జైతో సన్నిహితంగా ఉంటున్న అంజలి.. త్వరలో పెళ్లిచేసుకుంటారా?

గతంలో పిన్నితో వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన అంజలి.. మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్‌ కథానాయిక, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి పెళ్లి గురించి మరోసారి రూమర్స్‌ చక్కర్లు కొడుతున్న

Advertiesment
Actress Anjali Confirms Her Love with Jai
, ఆదివారం, 1 జనవరి 2017 (16:21 IST)
గతంలో పిన్నితో వివాదాల కారణంగా వార్తల్లో నిలిచిన అంజలి.. మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్‌ కథానాయిక, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి పెళ్లి గురించి మరోసారి రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న అంజలి ప్రస్తుతం కోలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. 2016లో బాలకృష్ణ సరసన డిక్టేటర్‌ సినిమాలో కథానాయికగా నటించింది. స్టైలిష్‌ స్టార్‌ బన్నీతో 'సరైనోడు'లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది.
 
కోలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టే.. అంజలి.. ఒక సహ నటుడితో ఆమె రిలేషన్‌షిప్‌లో ఉన్నారని వదంతులు వినిపిస్తున్నాయి. 'జర్నీ' సినిమాలో తనతో కలిసి నటించిన సహ నటుడు జైతో అంజలి సన్నిహితంగా ఉంటున్నట్టు కొన్నేళ్ల కిందట కూడా రూమర్స్‌ వచ్చాయి.
 
అయితే, అవే రూమర్స్‌ మళ్లీ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుండటం, ఆమె పెళ్లి గురించి కథనాలు వస్తున్నాయి. అయితే, అంజలి సన్నిహితులు మాత్రం వీటిని కొట్టిపారేస్తున్నారు. అంజలి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నారని, జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతో ఆమె ముందుకు సాగుతున్నట్లు తెలిసింది. జైతో ఈమె మ్యారేజ్ జరగవచ్చునని టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్ సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలైకా అరోరా-అర్బాజ్ ఖాన్‌ల విడాకుల వార్తలు తుస్సేనా..?