Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుష్కతో కాదు.. ఆ అమ్మాయితోనే ప్రభాస్ పెళ్లి

బాహుబలి - దేవసేనల లవ్వాయణంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాఫ్ పడనుంది. త్వరలోనే హీరో ప్రభాస్ భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. ప్రభాస్, అనుష్క జంటగా నటించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం గత నెల 28వ

అనుష్కతో కాదు.. ఆ అమ్మాయితోనే ప్రభాస్ పెళ్లి
, మంగళవారం, 30 మే 2017 (14:18 IST)
బాహుబలి - దేవసేనల లవ్వాయణంపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాఫ్ పడనుంది. త్వరలోనే హీరో ప్రభాస్ భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడు. ప్రభాస్, అనుష్క జంటగా నటించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం గత నెల 28వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా విజయఢంకా మోగించింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అన్ని రికార్డులను తిరగరాసింది. అదేసమయంలో ప్రభాస్, అనుష్కల ప్రేమాయణంపై కూడా రసవత్తర చర్చ జరిగింది. 
 
అయితే, వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి గురించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. భీమవరానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త మనవరాలితో ప్రభాస్‌ పెళ్లి జరుగబోతున్నట్టు సోషల్‌ మీడియాలో ఓ గాసిప్‌ ప్రచారం అవుతోంది. ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజుతో ఆ వ్యాపారవేత్త చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తోంది.
 
కాగా, ఇంగ్లీష్‌ పత్రికలు కూడా ప్రభాస్‌ పెళ్లి గురించి పలు రకాల కథనాలను ప్రచురిస్తున్నాయి. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘సాహో’ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జూన్ మొదటివారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ యేడాది ఆఖరునాటికి ప్రభాస్ ఓ ఇంటివాడు కావడం ఖాయమని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కథ సిద్ధం చేశానన్న డైరెక్టర్... ఎగిరి గంతేసిన జూనియర్ ఎన్టీఆర్?