జయసుధతో తీసిన చిత్రాల్లోనే భారీ నష్టం... అపుడే సూసైడ్‌కు యత్నిచిన నితిన్ కపూర్!?
చిత్ర పరిశ్రమలో అన్యోన్య దంపతులుగా ఉన్న వారిలో జయసుధ - నితిన్ కపూర్ జంట ఒకటి. వీరిద్దరిని చూస్తే ఎవరికైనా అసహ్యం కలుగుతుంది. అంతటి అన్యోన్యంగా ఉంటారు. అయితే, నిర్మాతగా, దర్శకుడిగా ఉన్న నితిన్ కపూర్...
చిత్ర పరిశ్రమలో అన్యోన్య దంపతులుగా ఉన్న వారిలో జయసుధ - నితిన్ కపూర్ జంట ఒకటి. వీరిద్దరిని చూస్తే ఎవరికైనా అసహ్యం కలుగుతుంది. అంతటి అన్యోన్యంగా ఉంటారు. అయితే, నిర్మాతగా, దర్శకుడిగా ఉన్న నితిన్ కపూర్... గతంలో పలు చిత్రాలను నిర్మించారు. వీటిలో ఎక్కువగా తన భార్య జయసుధను ప్రధాన పాత్రధారిగా పెట్టిగా పలు చిత్రాలు నటించారు. ఈ చిత్రాల్లో భారీ నష్టాలను నితిన్ కపూర్ చవిచూశారు.
నిజానికి దర్శకరత్న దాసరి నారాయణ రావు వద్ద నితిన్ కపూర్ అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తూ.. జయసుధను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జయసుధ ప్రధాన పాత్రధారిగా పలు చిత్రాలు నిర్మించారు. అవేవీ ఆయన కోరుకున్న ఫలితాన్నివ్వలేదు. దీంతో ఆర్థికంగా నష్టపోయారు. ఈ క్రమంలో ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఆయన గతంలోనూ ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
అప్పటి నుంచే కాకుండా చిత్రాలు నిర్మించడం గణనీయంగా తగ్గించేశారు. అదేసమయంలో ఆయన ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ఉండేవారని, తర్వాత ఆయన కోలుకోలేదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అయితే ఆయన ఏ విషయంలోనూ ఇబ్బందులపై నోరు జారలేదని ఆయనతో సన్నిహితంగా ఉండే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.