Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ తరహాలో ఎమోషన్‌‌ను నేను పండించలేను : అభిషేక్ బచ్చన్

''స్టూడెంట్ నెంబర్ 1'' జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన నుంచి పాటలూ అన్నీఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తరువాత యంగ్ టైగర్ వరుస సినిమాలు

Advertiesment
ఎన్టీఆర్ తరహాలో ఎమోషన్‌‌ను నేను పండించలేను : అభిషేక్ బచ్చన్
, గురువారం, 20 అక్టోబరు 2016 (15:32 IST)
''స్టూడెంట్ నెంబర్ 1'' జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన నుంచి పాటలూ అన్నీ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత యంగ్ టైగర్ వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్‌లను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ హీరో నటనలో దివంగత నటుడు సీనియర్ ఎన్టీఆర్‌నే మించిపోయాడని పలువురు అంటుంటారు. 
 
ముఖ్యంగా ఎలాంటి భారీ డైలాగ్ అయినా అవలీలగా చెప్పగలడు. కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు డాన్స్, ఫైట్స్, ఎమోషనల్ ఇలా అన్ని కోణాల్లో తనదైనశైలిలో నటనను పండిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్.. ఎన్టీఆర్ నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎన్టీఆర్‌లా నటన నాకు రాదు అని చెప్పాడు.


ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ - పూరిజగన్నాధ్ కాంబోలో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం ''టెంపర్''. కాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని పూరీ భావించాడు. దీంతో ఈ సినిమాను అభిషేక్‌కు చూపించాడు. ఈ సినిమాను పూర్తిగా చూసి ఎన్టీఆర్ అంత ఎమోషన్‌ను నేను పండించలేను సారీ అని చెప్పి సున్నితంగా తిరస్కరించాడట. నిజానికి టెంపర్‌లో ఎన్టీఆర్ ఓ రేంజ్‌లో నటించాడు కాదు కాదు.. జీవించాడు అని చెప్పాలి. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలని కేవలం ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు అని నిరూపించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21న కాజల్‌ చేతుల మీదుగా విశాల్ 'ఒక్కడొచ్చాడు' టీజర్‌