Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ సాధ్యమా...!

వివాదాలకు మారుపేరు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే రక్తచరిత్ర పేరుతో అనంతపురం ఫ్యాక్షనిజం, ఆ తర్వాత విజయవాడ రాజకీయాలను చూపిస్తూ 'వంగవీటి రాధ'లాంటి సినిమాలను తీశారు వర్మ. వర్మ తీసిన సినిమాలు ఎంత వరకు బాగా ఆడత

Advertiesment
NTR
, బుధవారం, 5 జులై 2017 (12:39 IST)
వివాదాలకు మారుపేరు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే రక్తచరిత్ర పేరుతో అనంతపురం ఫ్యాక్షనిజం, ఆ తర్వాత విజయవాడ రాజకీయాలను చూపిస్తూ 'వంగవీటి రాధ'లాంటి సినిమాలను తీశారు వర్మ. వర్మ తీసిన సినిమాలు ఎంత వరకు బాగా ఆడతాయో ప్రేక్షకులు చెప్పాలి కానీ... ఆయన పేరు మాత్రం మారుమ్రోగిపోతుంది. సినిమాల కన్నా టివి ఇంటర్వ్యూలలో వర్మ చెప్పే సమాధానాలు అటు యాంకర్‌ను ఇటు ప్రేక్షకులను ఆశ్చర్యపడేలా చేస్తుంది. ప్రశ్నకు సమాధానానికి ఎలాంటి పొంతన లేకుండా చెప్పడం వర్మ స్పెషాలిటీ. ఇది అందరికీ తెలిసిందే. అయితే అలాంటి వర్మ మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టాడు. అది కూడా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రమీదే. 
 
వర్మ ఇది చెప్పగానే ముందుగానే లక్ష్మీపార్వతి.. ఆ తర్వాత పోసాని కృష్ణమురళి ఇద్దరూ స్పందించారు. ఎన్టీఆర్ మీద బయో‌పిక్ తీస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఆ బయోపిక్ ఆయన్ను కించపరిచేలా మాత్రం ఉండకూడదంటున్నారు. జరిగిన మొత్తం కథను జరిగినట‌్లుగానే చూపించాలంటున్నారు. ఇక పోసాని విషయాన్ని చెప్పనక్కర్లేదు. బయోపిక్ తీయడం వర్మ మానుకుంటే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. సినిమాల వరకు ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే బాగుంటుంది.. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత నుంచి ఎన్ టిఆర్ ఎదుర్కొన్న సమస్యను ఏ విధంగా చూపిస్తారా అన్న వర్మను ప్రశ్నించారు పోసాని. 
 
పోసాని చెప్పే వాటిలో నిజం లేకపోలేదు. ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేయకుండా రాంగోపాల్ వర్మ బయోపిక్ తీయడం సాధ్యం కాదు. ఆయన్న ఎవరు వెన్నుపోటు పొడిచారు. హోటల్ దగ్గర ఎవరు చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నించారు.. ఇలాంటి వాటిపై వర్మ ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వలేరు. వర్మకు ఎన్టీఆర్ చరిత్ర అన్నీ తెలుసంటూనే పోసాని మాత్రం బయోపిక్ తీయాలన్న నిర్ణయాన్ని పూర్తిగా మానుకోవాలంటున్నారు. 
 
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ పైనే తెలుగుదేశం పార్టీ నేతల్లో చర్చ ప్రారంభమైంది. ఇలా చేస్తే ఖచ్చితంగా అధికారంలోకి ఉన్న పార్టీకి ఇబ్బందులు తప్పవన్న ఆలోచనలో తెదేపా నేతలున్నారు. అయితే వైకాపా మాత్రం బయోపిక్ తీస్తేనే మంచిదంటున్నారు. ఎందుకంటే అందులో ఎన్టీఆర్ చరిత్ర మొత్తం తీస్తే వెన్ను పోటు కూడా చూపిస్తారు కాబట్టి అది తమకు అనుకూలంగా ఉంటుందని వారి ఆలోచన. బయోపిక్ పై ఇప్పటికే ఇంత పెద్ద ఎత్తున రార్థాంతం జరుగుతున్నా రాంగోపాల్ వర్మ మాత్రం ఎప్పటిలాగే అన్నీ చూస్తూ ఊరుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నడ కురుక్షేత్రలో ద్రౌపదిగా నయనతార?