Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 March 2025
webdunia

పెళ్లయిన హీరోను నేనెలా వివాహం చేసుకుంటాను : ఆ హీరో నాగార్జునేనా: టబు

‘గ్రీకు వీరుడు... నా రాకుమారుడు’ అంటూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా తన కలల రాకుమారుడి గురించి టబు రెండున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉంది. మంచి ఎత్తు, ఎదుటి వారిని కట్టిపడేసే అందచందాలు ఇవేవీ టబ

Advertiesment
పెళ్లయిన హీరోను నేనెలా వివాహం చేసుకుంటాను : ఆ హీరో నాగార్జునేనా: టబు
, ఆదివారం, 16 జులై 2017 (14:41 IST)
‘గ్రీకు వీరుడు... నా రాకుమారుడు’ అంటూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా తన కలల రాకుమారుడి గురించి టబు రెండున్నర దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉంది. మంచి ఎత్తు, ఎదుటి వారిని కట్టిపడేసే అందచందాలు ఇవేవీ టబు పెళ్ళికి కలిసి రాలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్న టబుకి ఇంత వరకూ ఎవరూ నచ్చలేదు. తన కలల రాకుమారుడి కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది.
 
అయితే, దక్షిణాదికి చెందిన ఓ హీరోపై మనసుపారేసుకోవడం వల్లే ఆమె పెళ్లికి దూరంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై టబు తాజాగా స్పందించారు. దక్షిణాదిలో ఓ స్టార్‌ హీరోతో నాకు రిలేషన్‌ షిప్‌ ఉందని రాశారు. ఆ వ్యక్తికి అప్పటికే పెళ్ళయ్యింది. అలాంటి వ్యక్తితో రిలేషన్‌షిప్‌ ఎలా కంటిన్యూ చేస్తాను. సినిమాలు చేసినంత మాత్రాన ఆ వ్యక్తికీ నాకు సంబంధం ఉందనడమేనా? కొంచెం కూడా ఆలోచించరా? ఈ విషయాలు విన్నప్పుడు చాలా బాధనిపించేది. ఇప్పుడు అలాంటివి పట్టించుకోవడం మానేశాను.
 
ఇకపోతే... బాలీవుడ్ హీరో అజయ్‌ దేవగన్‌ నా వెల్‌విషర్‌. నాకు సంబంధించి మంచి ఏది జరిగినా మనస్ఫూర్తిగా సంతోషించే మొదటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నా పెళ్ళికి ఎలా అడ్డుపడతాడు? దీనికి సంబంధించి వార్తలు రాసే ముందు ఒక్కసారి ఆలోచించవచ్చు కదా? ఇంతవరకూ చెప్పని విషయాన్ని టబు ఇప్పుడే ఎందుకు చెబుతోంది? సరదాగా చెప్పిందేమో! అని ఆలోచిస్తే బాగుండేదని చెప్పుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వీట్‌హార్ట్స్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన శివగామి