"దేశముదురు"తో ముందుకు వచ్చిన హాన్సిక తన బ్యాగ్‌లో ఏమున్నా లేకపోయినా అది లేకుండా బయటకు కాలు పెట్టదట. అదంటే ఏదో అనుకునేరు. అది గ్రీన్ టీ ప్యాకెట్ అట. అలసిపోయి హబ్బా అని అనిపిస్తే వెంటనే గ్రీన్ టీ ప్యాకెట్ ఓపెన్ చేసి ఓ కప్పు లాగించేస్తుందట. అంతే... పరుగెత్తుకుంటూ ఒంట్లోకి హుషారు వచ్చేస్తుందట.
అన్నట్లు హాన్సిక ఇంకా టీనేజ్‌ను దాటనేలేదట. ఇంత చిన్న వయసులోనే బాగా సంపాదించేస్తున్న హాన్సికను తన స్నేహితులు అంత డబ్బును ఎక్కడ దాస్తున్నావని అడిగితే అంతా అమ్మకే ఇస్తున్నాను అంటోంది. అమ్మ నాకు మార్గదర్శకమని చెపుతోంది. ఎన్ని గంటలకు నిద్రలేవాలి, టిఫిన్ ఎప్పుడు తినాలి. భోజనం ఎన్ని క్యాలరీలు ఉండాలి అనేవి తన తల్లే నిర్ణయిస్తుందని చెపుతోంది ఈ తెల్లపిల్ల.
తను అలసటగా ఉన్నట్లు కనిపిస్తే తన తల్లి చిన్నప్పుడు గ్రీన్ టీ ఇచ్చేదనీ, ఇప్పుడు కూడా అలసట తీరేందుకు దానినే ఆశ్రయిస్తున్నాననీ చెపుతోంది. తాజాగా "సీతారాముల కల్యాణం లంకలో" చిత్రం షూటింగ్ గ్యాప్ లో కూడా గ్రీన్ టీని సిప్ చేస్తూ కనబడిందట. మొత్తానికి హాన్సిక ఎనర్జీ వెనుక గ్రీన్ టీ హస్తం ఉందన్నమాట.