Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీనియర్ ఎన్టీఆర్ పెళ్లిరోజునాడే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి

Advertiesment
జూనియర్ ఎన్టీఆర్
WD
ప్రముఖ వ్యాపారస్తుడు నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణీతను జూనియర్ ఎన్టీఆర్ వివాహమాడబోతున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వివాహం ఎప్పుడూ..? అనే ప్రశ్నకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఒక తేదీని చెప్పినట్లు తెలిసింది. ఆ తేదీ 2010 ప్రథమార్థంలో... అంటే తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ పెళ్లిరోజు అయిన మే 21వ తేదీనాడు జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేయబోతున్నట్లు సమాచారం.

వివాహం గురించి మరిన్న వివరాలు చెప్పమని జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రశ్నిస్తే... సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాననీ, తను చెప్పకముందే మీడియా తన పెళ్లి గురించి చాలా విషయాలు చెప్పేసిందనీ వ్యాఖ్యానించారు.

తాత పెళ్లిరోజే వివాహం చేసుకోబోతున్నారని వస్తున్న వార్తలు నిజమేనా..? అని అడుగగా... అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu