Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సచిన్ టెండూల్కర్ కోసం సమీరా రెడ్డి డ్యాన్స్.. డ్యాన్స్!!

Advertiesment
సమీరా రెడ్డి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోసం సమీరా రెడ్డి నృత్యం చేయనుంది. టెండూల్కర్ కోసం డ్యాన్స్ చేయడమేమిటీ.. అనుకుంటున్నారా..? మరేం లేదు, ఇటీవల సచిన్ టెండూల్కర్ 17వేల పరుగుల మైలురాయిని దాటి రికార్డు సృష్టించడంతో అంబానీ గ్రూపు ఆయనను సత్కరించాలని నిర్ణయించింది. 

సత్కార సభకు ముందు ఆటా పాటా కావాలి కదా. దీనికిగాను సమీరారెడ్డిని అడిగారట. తొలుత సమీరా "నో" అని చెప్పిందట. కానీ ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ కోసమే ఆ సభ నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని ప్రత్యేకంగా అంబానీలకు ఫోను చేసి డ్యాన్స్ చేస్తానని ఒప్పేసుకుందట.

సమీరా రెడ్డికి ఎందుకంత ఆసక్తి అని ఆరా తీస్తే, స్కూలు రోజుల్లో తను కూడా క్రీడల్లో చురుకుగా పాల్గొనేదట. ముఖ్యంగా తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమనీ, అందువల్ల మేటి క్రీడాకారుడైన సచిన్ సత్కార సభలో నృత్యం చేయడం ఒక భాగ్యంగా భావిస్తున్నాని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu