Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెక్కలుండవు... కానీ ఆకాశంలో ఎగురుతుంటా: త్రిష

Advertiesment
సెక్సీ నటి
యవ్వనంలో ఉన్న అమ్మాయికి ఎటువంటి కలలు వస్తాయి...? సహజంగా రాకుమారుడు లాంటి భర్త కావాలన్న కలలు వస్తాయి. కానీ త్రిషకు మాత్రం కళ్లు మూస్తే కొత్త కలలు వెంటాడుతున్నాయట. ఆ కలల సారాంశం కాస్త చెప్పవూ... అని కదిలిస్తే ఇలా చెప్పుకొచ్చింది.

"ఆకాశం నుంచి దూకేసినట్లు తరచూ కల వస్తుంది. ఆకాశంలో నుంచి కిందికి దూకేటపుడు చాలా తేలికగా ఎగురుతూ ఉంటాను. ఎంతసేపటికీ భూమిపైకి రాలేను. భూమికి దూరంగా ఉన్నా కంగారు పడకూడదని అనిపిస్తుంది.

అయితే ఒక్కోసారి పడిపోతానేమోనని భయమేస్తుంది. ఆ భయంతో గొంతు తడారి నాలుక పిడచ కట్టుక పోతుంది. భూమి సమీపించే కొద్దీ నాలో ఆందోళన బయలుదేరుతుంది. భూమ్మీద దబ్బున కింద పడిపోతానేమోనన్న భయం రెట్టింపవుతుంది.

అంతే ఒక్కసారిగా మెలకువ వస్తుంది. లేచి చూద్దును కదా... మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంచక్కా నిద్ర లాగించేస్తుంటారు. ఓహ్ ఇది కలా అని అనుకుంటాను. అయితే గొంతు తడారి నాలుక పిడచకట్టుక పోవడంతో ఓ చెంబుడు మంచినీళ్లు తాగి తిరిగి కళ్లు మూసుకుంటాను" అంటూ తనకు తరచూ వచ్చే కలను గురించి చెప్పింది త్రిష.

Share this Story:

Follow Webdunia telugu