Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయాలలోకి మంచు లక్ష్మీ ప్రసన్న...?

Advertiesment
మంచు లక్ష్మీ ప్రసన్న
WD
ఇటీవల తెలంగాణా రాష్ట్ర సమితి కార్యకర్తలు మంచు లక్ష్మీ ప్రసన్న నిర్మాతగా మంచు మనోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్‌ను హైదరాబాదులో అడ్డుకోవడం, ఆ తర్వాత జరిగిన సంఘనటల నేపధ్యంలో మంచు లక్ష్మి రాజకీయాలలోకి ప్రవేశించాలని నిశ్చయించుకున్నట్లు టాలీవుడ్ గుసగుసలుపోతోంది.

తండ్రి మోహన్ బాబు ఈసరికే రాజకీయాలలో ప్రవేశించి ఎన్టీఆర్ మరణం తర్వాత వాటికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రజలలో బలం లేని నాయకులు సైతం రాజకీయాలలో ప్రవేశించి ఆగడాలకు పాల్పడంపై మంచు మోహన్ బాబు దృష్టి సారించినట్లు సమాచారం. తండ్రి ఆలోచనను తెలుసుకున్న కుమార్తె తాను రాజకీయాలలోకి ప్రవేశిస్తానని చెప్పినట్లు భోగట్టా.

ఆ మధ్య ఓ మీడియా సమావేశంలో తమ షూటింగ్ భగ్నం చేసినచోటే తిరిగి షూటింగ్ చేస్తానని లక్ష్మి సవాల్ విసిరారు. అటువంటి ధైర్యసాహసాలను ప్రదర్శించగల ఓ మహిళకు రాజకీయాలలో బాగా రాణించే అవకాశం ఉంటుందని సన్నిహితులు చెప్పినట్లు తెలుస్తోంది. తమ తండ్రి మోహన్ బాబు తమకు ధైర్యాన్ని, నీతి నిజాయితీలను పోసి పెద్ద చేశారని చెప్పే మంచు లక్ష్మీ ప్రసన్న ఒక సినీ నిర్మాతగానే కాక రాజకీయాల్లోనూ రాణిస్తారో లేదో చూడాలి మరి...

Share this Story:

Follow Webdunia telugu