తమిళనాట అగ్రహీరోల సరసన నటిస్తూ మహా బిజీగా ఉన్న తమన్నా, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. కుర్ర హీరోలతో నటిస్తున్నప్పటికీ రజనీతో జీవితంలో ఒకే ఒక్క సినిమా చేస్తే చాలు... తన కెరీర్‌లో ఒక గోల్ పూర్తి చేసినట్లు ఫీలవుతానని చెపుతోంది.
కుర్ర హీరోలతో అనుభవం ఎలా ఉందని కదిలిస్తే.. సూర్య, ధనుష్, విజయ్, భరత్, జయం రవి... ఇలా అందరినీ పేరుపేరునా పొగడ్తలతో ముంచెత్తింది. తమన్నాకు సక్సెస్ సీక్రెట్ బాగానే తెలిసినట్లుంది.
అంతేకాదండోయ్... రజనీకాంత్ సరసన ఛాన్స్ వస్తే ఆ తార ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నట్లే లెఖ్ఖ అని కొత్త సమీకరణాలు చెపుతోంది. మరి కథానాయకుడులో రజనీ సరసన నటించిన నయనతార కోలీవుడ్ లో నెంబర్ వన్ గా ఉన్నదా...? అని అంటే, ఏమీ తెలియనట్లు, విననట్లు షూటింగ్ లో నిమగ్నమైంది. నయనతారను అడిగితే ఏం చెపుతుందో..?