Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూ ట్యూబ్‌లో బిపాసా బసు

Advertiesment
బిపాసాబసు
IFM
వివేక్ ఒబెరాయ్, బిపాసాలపై చిత్రీకరించిన ఓ ప్రకటనలో బిపాసాబసు టాప్‌లెస్‌గా కనిపించిందట. ప్రస్తుతం బిపాసా టాప్‌లెస్ దృశ్యాలు యూ ట్యూబ్‌లో దర్శనమిస్తున్నాయి. దీంతో సైబర్ కేఫ్‌లో బిపాసా ప్రియులు ఎగబడుతున్నారట.

కాగా యూ ట్యూబ్ బిపాసా టాప్‌లెస్ దృశ్యాలను జోడిస్తూ... ఆ దృశ్యాలను కెన్ నాహౌమ్ అనే దర్శకుడు చిత్రీకరించాడని వెల్లడించింది. పైగా ఈ దృశ్యాలు భారతదేశంలోనే తీసినట్లు తెలిపింది. అయితే వివేక్ ఒబెరాయ్‌తో కలిసి బిపాసా టాప్‌లెస్‌గా నటించిందన్న వార్తలపై ఒబెరాయ్ వ్యక్తిగత కార్యదర్శి స్పందించడానికి నిరాకరించారు.

అసలాయన బిపాసాతో కలిసి అటువంటి వాణిజ్య ప్రకటనలో నటించారో లేదో తమకు తెలియదని చెప్పారు. అయితే బిపాసాబసు మేనేజర్ మాత్రం వాణిజ్య ప్రకటనలో ఆమె నటించిన మాట వాస్తవమేనంటున్నాడు. ఆమె 1999లో ఆ ప్రకటనలో నటించిందని చెప్పుకొచ్చాడు.

అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని అప్పట్లో ఆ వాణిజ్య ప్రకటనను రూపొందించారని వెల్లడించాడు. అలా ఆ రోజు చిత్రీకరించిన ప్రకటన ఇపుడు నెట్‌లో ఎందుకు దర్శనమిస్తుందో తనకైతే అర్థం కావడం లేదని అంటున్నాడు. కనుక బిపాసా బసు టాప్‌లెస్‌గా నటించిన మాట వాస్తవేనన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu