యాడ్ ఫిల్మ్‌లో ప్రిన్స్ మహేష్.. టెన్నిస్ రాణి సానియా!
, గురువారం, 29 అక్టోబరు 2009 (13:50 IST)
టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ప్రిన్స్‌గా పేరుగాంచిన మహేష్ బాబు.. టెన్నిస్ క్రీడారంగంలో తన హృదయ అందచందాలతో కోట్లాది అభిమానుల మనస్సు దోచుకున్న సానియా మీర్జాలు కలిసి నటించనున్నారు. ఒకరు చిత్ర పరిశ్రమ, మరొకరు టెన్నిస్ క్రీడారంగం. వీరిద్దరు కలిసి నటించడం ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా? ఈ కల నిజం కాబోతుంది. అయితే వెండితెరపై మాత్రం కాదండి. ప్రైవేట్ టెలికామ్ రంగంలో ఒకటిగా పేరొందిన ఎయిర్‌సెల్ కంపెనీ వీరిద్దరితో ఒక యాడ్ ఫిల్మ్‌ను తీయనుంది. ఇందుకోసం మహేష్ బాబు డబుల్ డిజిట్‌తో కూడిన కోట్లాది రూపాయలను యాడ్ ఫీజుగా ఛార్జ్ చేయనున్నారు. అలాగే, సానియా మీర్జా కూడా ఇదే మొత్తంలో అడుగుతోందట. సానియాకు చెల్లించే మొత్తంపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వస్తే ఎయిర్‌సెల్ యాడ్‌లో వీరిద్దరు కనిపించడం ఖాయమంటున్నారు. ఈ యాడ్‌లో మహేష్-సానియాల మధ్య చిన్నపాటి స్టెప్పులు కూడా ఉంటాయని ఆ కంపెనీ వర్గాల సమాచారం. తమిళనాడు కేంద్రంగా పని చేస్తున్న ఈ టెలికామ్ కంపెనీకి తమిళనాడులో బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో సూర్య ఉండగా, తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నారు. వీరుకాకుండా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సానియా మీర్జాలు కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.