చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ తొలి చిత్రం "చిరుత" ద్వారా తెలుగులో పరిచయమైన నటి నేహా శర్మ. ఆ చిత్రం తర్వాత ఇద్దరికీ మంచి అండర్‌స్టాండింగ్ వచ్చిందనే వార్తలు వచ్చాయి. కానీ అవేవీ ఆమె కెరీర్‌కు హెల్ప్ కాలేదు. ఆ తర్వాత కుర్రాడులో నటించింది. అదీ ఫ్లాప్ కావడంతో ఇక లాభం లేదని రూటుమార్చి హిందీలోకి వెళ్లింది.
అక్కడ "క్రూక్" అనే చిత్రంలో నటించింది. ఇమ్రాన్ హష్మీతో చేస్తోంది. మరి ఆయనతో చేయాలంటే పెదాలు ఎంగిలిచేయాలి కదా మేడమ్ అంటే... అవునని తలూపుతోంది. దర్శకుడు మోహిత్ సూరి ముందే ముద్దు సన్నివేశాలుంటాయని చెప్పాడని నిర్భయంగా చెపుతోంది.
ఆస్ట్రేలియా నేపథ్యంలో సాగే ఈ కథలో... ఆస్ట్రేలియన్ ముద్దులు చాలానే ఉన్నాయని అంటోంది. మరి ఈ దెబ్బతో నేహా శర్మకు ఆఫర్లు తెగ వచ్చిపడతాయేమో చూడాలి.