బాలీవుడ్ నటి "చెక్ దే ఇండియా", కిడ్నాప్ ఫేమ్ విద్యా మల్‌వాడే తెలుగులో నటిస్తానని ప్రకటించింది. అయితే బాలీవుడ్‌కు వచ్చిన దర్శకనిర్మాతలంతా మోడల్స్‌ను ఆకర్షిస్తున్నారని విమర్శిస్తోంది. తాను తెలుగు నటించడానికి సిద్ధమేనని, అందుకు తానేమీ ఆంక్షలు విధించబోనని స్పష్టం చేసింది.
ప్రస్తుతం తాను నటించిన తాజా చిత్రం ఈ నెల 29న విడుదలవుతుందని, ఇంకా రెండు బాలీవుడ్‌ల చిత్రాల్లో నటిస్తున్నానని తెలిపింది. శనివారం నాడు హైదరాబాద్‌లో ఓ జ్యూవల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె పలు విషయాలను వెల్లడించింది.
ఎక్స్‌పోజింగ్ అనేది నటిగా పెద్ద విషయం కాదని, దీన్ని ఎందుకనో మీడియా ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తుందని విద్యా మల్‌వాడే చమత్కరించింది. ఇప్పటి కల్చర్ చాలా మారిందని, పబ్‌ల్లో మాకంటే అందగత్తెలు ఎక్స్‌పోజింగ్ బాగా చేస్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.