Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ ప్రియుల గోల గోల: ఐశ్వర్యారాయ్ వలవల

Advertiesment
ఐశ్వర్యారాయ్
FILE
ఒక స్త్రీ ఒక మగాడితో సన్నిహితంగా మెలిగితే. అదే స్నేహం అంటారు కొన్నాళ్లు... ఆ తర్వాత దాన్నే డేటింగ్ అంటారు. ఆ తర్వాత ఇంకేదో ఉందంటారు. ఇప్పుడిదే చెపుతున్నారట ఐశ్వర్యారాయ్ మాజీ బాయ్ ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్.

వాళ్లిద్దరూ ఎక్కడబడితే అక్కడ ఐశ్వర్యారాయ్ తనతో "అలా ఉంది... ఇలా ఉండేది..." అని లేనిపోని మాటలు చెపుతూ గాలికి కట్టేస్తున్నారట. తమ మధ్య కొనసాగిన బంధం ఎటువంటిదో అందరికీ తెలుసుననీ, అయినా వివరించాల్సి వచ్చింది కనుక విడమర్చి చెపుతున్నామని గోల చేస్తున్నారట. అది ఆ నోటా.. ఈ నోటా తిరిగి చివరికి ఐష్ చెవికి చేరిందట. ఈ మాటలను విన్న ఐశ్వర్యారాయ్ వలవల ఏడ్చేసిందట.

గద్గత స్వరంతో ఐష్, తనకు ఇష్టమైన దారిలో తన జీవితాన్ని గడుపుతున్నానని భోరున ఏడ్చేసిందట. అయితే వివేక్ మాత్రం తన కెరీర్ మటాష్ అవడానికి కారణం ఐశ్వర్యారాయేనని పళ్లు నూరుతున్నాడట. అంతేకాదు తన సన్నిహితులతో ఈ విషయాన్నే చెపుతున్నాడట. సల్మాన్ సైతం తనతో డేటింగ్ చేసిన వివరాలను పూసగుచ్చినట్లు ఇంటర్వ్యూల ద్వారా ఏకిపారేస్తున్నాడట.

ఐశ్వర్యారాయ్ శ్రేయోభిలాషులు మాత్రం, వివేక్, సల్మాన్లిద్దరూ విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారనీ, ఒక స్త్రీ వివాహంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాక ఆమె గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలుకుతున్నారట.

Share this Story:

Follow Webdunia telugu