Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పదిహేనేళ్ళకే అతడిని ప్రేమించా.. తిరిగా... వదిలేశా: బిపాస

Advertiesment
పదిహేనేళ్ళకే అతడిని ప్రేమించా.. తిరిగా... వదిలేశా: బిపాస
, సోమవారం, 16 జులై 2012 (12:35 IST)
సినిమా హీరోయిన్లు అయ్యాక భామలు తన ఫ్లాష్‌బ్యాక్‌లు చెబుతుంటే చాలా సరదాగా ఉంటుంది. నటి బిపాసాబసు అనగానే మనకు గుర్తుకువచ్చేది జాన్‌ అబ్రహం. ఇద్దరికీ ప్రేమ రసపట్టున పడిందన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ వారి ప్రేమకు విలన్‌ వాళ్ళ అమ్మే... క్రిస్టియన్‌ అయితే వద్దంటుందట. 

అందుకే ఇద్దరూ విడిపోయాక అమ్మ చాలా హ్యాపీగా ఉందని చెబుతోంది. అసలు ఈ ప్రేమ అనేది నాకు 15 ఏళ్ళకే పుట్టింది. న్కూల్లో ఉన్నప్పుడే ఒకబ్బాయి నన్ను ప్రేమించాడు. మనిషి చాలా మంచివాడు. మార్వాడీ కుటుంబం. అమ్మకు చెబితే పిల్ల చేష్టలని కొట్టిపారేసింది.

కానీ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంటానంటే అమ్మ ఆశ్చర్యపోయింది. తను శాఖాహారి.. నేను కూడా అలా మారిపోయాను. కొన్నాళ్ళపాటు ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని తిరిగాం. ఐతే ఆ తర్వాత తేడా వచ్చి మేం విడిపోయాం.. అమ్మ చాలా హ్యీపీగా ఫీలయిందంటూ గతాన్ని గుర్తుచేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu