టాప్ హీరోయిన్లకు తీరిక ఉండదనేది తెలిసిందే. గ్లామర్ డాళ్ నమితకు కూడా అస్సలు తీరికే దొరకడం లేదట. తను నటించిన సినిమాలను తాను చూడాలంటేనే తగిన సమయం దొరకడం లేదని వాపోతోంది.
షూటింగ్ సమయాల్లోనే ఏ సీన్ ఎలా చేశామో, ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నామోనని చూసుకుంటానని చెపుతోంది. సినిమా షూటింగ్ అయిపోయాక రోజువారి బిజీల్లో పడిపోయి తర్వాత ఏం చేయాలనేదానిపై ఆలోచన చేస్తామని అంటోంది.
రోజూ షూటింగ్ హడావుడిలో ఏ సినిమాలో ఎలా చేశామో కూడా ఒక్కోసారి గుర్తుండదు. అభిమానులే వచ్చి.." అడవిలాంటి అందాలే ఆక్రమించాడే... సింహా సింహా" అంటూ సినిమా గురించి చెపితే నవ్వి ఊరుకుంటాం అని అసలు విషయాన్ని బయటపెట్టింది బొద్దందాల నమిత.