Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నగ్నంగా నటించమని.. హాలీవుడ్ అడిగిందట!!

Advertiesment
సెక్స్ బాంబులు
నగ్నంగా నటించే సెక్స్ బాంబులు, ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేసే సెక్సీ భామలు, బికినీలేసుకుని ఈత కొలనులో చేపపిల్లల్లా ఈదే రమణులు అందరూ చెప్పేమాట- "సన్నివేశం అడిగింది- అందుకే చేశామ"ని. ఇప్పుడు ఇదేమాటను బాలీవుడ్ సెక్సిణి నందనాసేన్ కూడా చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు భోగట్టా. 

ఇదిలావుంటే నందనా సేన్ అందాలకు గులామైన ఎందరో హాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాలలో నటింపజేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారట. ఇందులో భాగంగా ఆమె ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ చిత్రాలను అంగీకరించిందట. వీటిలో ఒకటి ఇటాలియన్ నిర్మాత చిత్రం కూడా ఉందట.

అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆ ఇటాలియన్ చిత్రంలో నందనాసేన్ నగ్నంగా నటించాల్సిన సన్నివేశం ఒకటి ఉన్నదట. ఆమెను ఏ వైపు నుంచి నగ్నంగా చూపిస్తే మరింత సెక్సీగా ఉంటుందో టెస్ట్ చేయమని సదరు నిర్మాత ఓ ఫోటో‌గ్రాఫర్‌కు చెప్పాడట.

అంతే..! అతగాడు నందనాను అనేక భంగిమల్లనిలబెట్టి ఫోటోలను తీశాడట. ఎన్ని ఫోటోలు తీశావేంటి... అని అతగాడిని ఆరా తీస్తే..." ఛ! అటువంటిదేమీ లేదు. ఎవరు మీకు చెప్పింది. మా ఫ్యాషన్ డిజైనర్ కొన్ని ప్రత్యేకమైన డ్రెస్సులు తయారు చేసి వాటిని నందనతో ధరింప చేసి ఫోటో సెషన్ చేయమన్నాడు. చేశాను. అంతే, నగ్నం లేదూ.. గిగ్నం లేదు" అన్నాడట.

అన్నట్లు ఆ ఫ్యాషన్ డిజైనర్ తయారు చేసిన వస్త్రాలన్నీ టూ-పీస్ రకం దుస్తులేనట. రిబ్బన్ కంటే తక్కువ వెడల్పుతో ఉండే ఆ దుస్తులను వేసుకున్నా, వేసుకోకపోయినా ఒకటేనని కొందరు అంటున్నారు. ఇది నిజమా... కాదా అని నందనాను అడుగుదామని కొందరు జర్నలిస్టులు ప్రయత్నిస్తే, ఆమె అందుబాటులో లేదట.

Share this Story:

Follow Webdunia telugu