ఇటీవల ఓ పత్రిక ముఖచిత్రంపై టాప్‌లెస్ ఫోజుతో దక్షిణాది చిత్ర పరిశ్రమను నివ్వెరపరిచిన కాజల్ అగర్వాల్ ఆ పని ఎందుకు చేసిందన్నదానిపై ఇపుడు డిసెక్షన్ జరుగుతోంది. ఈమధ్య "సింగం" విడుదలైన హిందీ చిత్రం సింగం హిట్టే దీనికి కారణమంటున్నారు. అంతేకాదు చిత్రం సక్సెస్‌తో కళ్లు నెత్తికెక్కిన కాజల్ దక్షిణాది పరిశ్రమలను ఈసడించుకుంది.
తాను టాలీవుడ్, కోలీవుడ్‌కు ప్రాధాన్యతనివ్వననీ, తను ఉత్తరాది భామను కనుక బాలీవుడ్ తనకు అత్యంత ప్రాధాన్యమైనదనీ డబ్బా కొట్టింది. కాజల్ అగర్వాల్ వ్యాఖ్యలపై అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ పరిశ్రమలు గరంగరం అయ్యాయి.
తమిళ దర్శకుడు భారతీరాజా అయితే కాజల్ అగర్వాల్ ఓ సేల్స్ గాళ్ అనీ, ఏదో దయతలచి ఛాన్సులిస్తే కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. ఆ తర్వాత కాజల్ ఇక్కడికి వచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని భోగట్టా. దీంతో ఏం చేయాలో తోచని కాజల్.. ఎలాగైనా బాలీవుడ్‌లో స్థిరపడాలన్న ధ్యేయంతో బ్లౌజ్ విప్పేసి టాప్‌లెస్ ఫోజులతో ఆకట్టుకోవాలన్న సంచలన నిర్ణయాన్ని తీసుకున్నదట. విప్పేసింది సరే... మరి ఎన్ని ఆఫర్లు వచ్చాయో...?!!