ఐశ్వర్యా... సల్మాన్ సరసన నటించవూ... ప్లీజ్‌జ్!!
ఐశ్వర్యారాయ్ మళ్లీ సల్మాన్ ఖాన్ సరసన నటించడమా...? ఇది కుదిరే పనేనా..? ఛాన్సే లేదని అందరూ అంటారు. కానీ వీళ్లని జోడీగా చేసి సినిమా తీస్తానని బాలీవుడ్ రచయిత ఛాలెంజ్ చేస్తున్నాడు. తను కొత్తగా నిర్మించబోయే చిత్రంలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్‌లిద్దరినీ కలిపి నటింపజేస్తానని అక్తర్ చెపుతున్నాడు. ఇప్పటికే సల్మాన్ కాల్షీట్లను కూడా తీసుకున్నాడట. ఇంతకీ కథ ఏమిటని అడిగితే... ఐష్- సల్మాన్ జీవితాలను ఆధారంగా చేసుకుని సాగే ప్రేమకథ అని చెపుతున్నాడట. ఈ చిత్రానికి "అజబ్ హై ఇష్క్" అనే పేరును కూడా నిర్ణయించాడట.ఇక ఐశ్వర్యారాయ్ అంగీకారమే తరువాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ఐశ్వర్య చెవిన వేశాడట. కానీ ఐష్ వద్ద నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తెలిసింది. సల్మాన్-ఐష్ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం "హమ్ దిల్ దే చుకే సనమ్" బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ కూడా అలాగే పేలిపోయిందనుకోండి. ఆ తర్వాత ఎవరికి వారు విడిపోయారు. ఐష్- అభిని వివాహమాడి జీవితంలో స్థిరపడింది. ఇప్పుడు కొత్తగా అక్తర్ మరోచరిత్రను సృష్టించాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకదా... రొటీన్‌కి భిన్నంగా ఉన్నప్పుడే బ్రేకో.... షేకో వచ్చేదీ!!