నీలవేణిలో హీరో ముకుల్‌దేవ్‌కు గాఢ చుంబనం రుచి ఏమిటో చూపించింది బబ్లీ బ్యూటీ ఆర్తీ అగర్వాల్. ఈ ముద్దు సన్నివేశాన్ని చూసిన ఆర్తీ అమెరికా భర్త ఊగిపోయాడట. తక్షణమే ఆర్తీని వదిలించుకోవాలనుకుని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించాడట. అయితే అంతకంటే ముందే ఆర్తీ ఒక అడుగు ముందుకేసి తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
అప్పట్లో యువనటుడు తరుణ్ తో ప్రేమ వ్యవహారం విఫలమై చివరికి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఆర్తీ, ఆ తర్వాత టాలీవుడ్ ముఖం చూడకూడదని నిర్ణయించుకుని అమెరికా అబ్బాయిని ఏరికోరి చేసుకుంది. అయితే ఆ తర్వాత తిరిగి సినిమాలలో నటిస్తానని భర్త వద్ద మారాం చేసేదట. దానికతను ఒప్పుకోకపోవడంతో కొన్నాళ్లు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుందట.
ఇటీవల టాలీవుడ్ కు ల్యాండ్ అయిన తర్వాత వరుసగా సినిమాలు చేసేందుకు సంతకాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఆమె నటించిన నీలవేణిలో గాఢ చుంబన సన్నివేశంలో నటించడంతో ఆర్తీ- అమెరికా అబ్బాయి వివాహ బంధానికి బీటలు వారినట్లు ఫిలిమ్ నగర్ సినీజనం అనుకుంటున్నారు. ఫలితంగానే ఆర్తీ అగర్వాల్ విడాకులకు కోర్టులో పిటిషన్ వేసినట్లు అంటున్నారు.