Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మో.. నయన పారితోషికం పెంచేసిందట..!

Advertiesment
నయనతార
దక్షిణాది సినీరంగంలో అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న మలయాళీ ముద్దుగుమ్మ నయనతార. తాజాగా క్రేజీ హీరో "ఆంజనేయులు" చిత్రంలో నటిస్తోన్న నయన, తన పారితోషికాన్ని భారీగా పెంచేంసిదని టాలీవుడ్ వర్గాల్లో టాక్. కేవలం 35 రోజులకే ఆంజనేయులు చిత్ర నిర్మాత నయనకు 65 లక్షలు చెల్లించాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. 

లక్ష్మీ, దుబాయ్ శీను వంటి చిత్రాల ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించిన నయనకు ఈ మధ్య అంతగా ఛాన్సులు రావడం లేదట. దీంతో వచ్చిన అవకాశాల్లోనే బాగా సంపాదించేయాలని నయన ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

దీంతో నిర్మాతలు తన దగ్గరకు వచ్చి"ఛాన్సిస్తాం తల్లీ అంటేనే.. నో చెప్పకుండా.. ఈ మొత్తాన్ని ఇవ్వండి" అంటూ నయన ఓ ఫిక్స్‌డ్ రేట్ చెబుతోందని సినీ వర్గాల సమాచారం. అదీ టాలీవుడ్ సినిమాలకే ఈ సెక్సీడాళ్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తుందని టాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఇప్పటికే రవితేజ సినిమాకు పెద్ద మొత్తం గుంజేయాలని ప్లాన్ చేస్తున్న నయన, జూనియర్ ఎన్టీఆర్‌తో నటించే మరో ఛాన్సును కూడా కైవసం చేసుకుందట. ఇంకేముంది..? ఈ సినిమా ద్వారా నయనకు భారీ పారితోషికం లభిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu