అబ్బిబ్బీ... అంటూ తెలుగు కుర్రకారును ఓ ఊపు ఊపిన సెక్సీ తార రంభ, వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇంద్రన్ పద్మనాధన్ అనే వ్యాపారస్తునితో పెళ్లి జరుగబోతోందని టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. అంతేకాదు, రంభ స్వయంగా తన పేరుమీద డిసెంబరు నెలలో ఒక తేదీనాడు వివాహం చేసుకునేందుకుగాను కల్యాణమండపాన్ని బుక్ చేసిందట.
ఈ విషయాన్ని రంభ వద్ద ప్రస్తావిస్తే... పకా పకా నవ్వింది. అసలు ఇంతవరకూ సంబంధమే కుదరలేదనీ, అలాంటప్పుడు పెళ్లెలా జరుగుతుందని ఎదురు ప్రశ్నలేస్తోంది. అయితే కల్యాణమండపం తన పేరు మీద బుక్ చేసిన మాట వాస్తవమేననీ, కానీ అది తన సోదరుని వివాహం కోసం బుక్ చేశానని చెపుతోంది.
అంటే.. ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన లేదా...? అని అడిగితే, "సంబంధాలను చూస్తున్నారు. అబ్బాయికి నేను, నాకు అబ్బాయి నచ్చాలి కదా. అన్నీ నచ్చితే పెళ్లి చేసుకునేందుకు నేను సిద్ధంగానే ఉన్నా"నని చెపుతోందట రంభ.