నీతూ చంద్రకు రాజశేఖర్‌తో వివాదం ఏర్పడిన తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. చేసేది లేక పొలోమంటూ కోలీవుడ్ సినీ పరిశ్రమకు వెళ్లి తమిళ సినీ అవకాశాలు వెతుక్కుంటోంది.
అందాల ఆరబోతకు ముందుండే నీతూ చంద్రా... తమిళంలో నటించే తెలుగు కుర్ర హీరో విశాల్ నటించే తెలుగు, తమిళ వెర్షన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో దర్శకుడు ఆమెను ఎర్ర మిరపకాయలలో పొర్లాడుతూ నటించమని చెప్పాడట. చిత్రం... అంతటి ఎర్రగారపు మిరపకాయల్లో దొర్లాడినా నీతు శరీరానికి కాస్త మంటైనా అనిపించలేదట.
పైపెచ్చు ఎర్రమిరపకాయలలో దొర్లాడుతూ తన అందాలను వెరైటీగా చూపించే ప్రయత్నం చేసిందట. షూటింగ్ లో తనకు మంటలేదని చెప్పినా... ఇటీవల పబ్‌లలోకి వెళ్లినప్పుడల్లా ఐస్ క్యూబ్‌లను శరీరానికి తాకించుకుంటూ కాలం గడుపుతోందట. అటువంటి సమయంలో ఓ అబ్బాయి నీతూను పలుకరించడానికి అటుగా వచ్చినపుడు అతని షర్ట్ లోపల ఐస్ క్యూబ్ వేసి ఆటపట్టించిందట. మొత్తానికి ఎర్రమిరపకాయలు నీతూతో వెర్రి చేష్టలు చేయిస్తున్నాయన్నమాట.