అన్నమయ్య కీర్తనలు రెహ్మాన్ కొత్త రాగంలో...!!?
వందేమాతరం గీతాన్ని తనదైన బాణీలో ఆలపించి భారతదేశాన్నే కాక యావత్‌ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్న ఏఆర్ రెహ్మాన్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు కలిసినట్లు భోగట్టా. అలనాడు అన్నమయ్య కమనీయంగా ఆలపించిన కీర్తనలను కొత్త రాగాల్లో వినిపించాలని రెహ్మాన్‌ను తితిదే కోరినట్లు సమాచారం. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించే అన్నమయ్య గీతాలను అంతే స్థాయిలో సాంప్రదాయ పద్ధతిలో కొత్త కోణంలో ఆవిష్కరించమని టిటిడి అడిగినట్లు భోగట్టా. గోవిందుని కీర్తనలను తనదైన బాణీలో భక్తులకు అందించడానికి రెహ్మాన్ సంసిద్ధత తెలియజేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.అదే గనుక నిజమైతే తాళ్లపాక అన్నమాచార్యులవారి పదకవితలకు రెహ్మాన్ ఎటువంటి బాణీలను అందిస్తారో చూడాల్సిందే.