Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'రుద్రమదేవి' హీరో అనుష్కనే!: దగ్గుబాటి రానా

Advertiesment
Rana
, మంగళవారం, 24 మార్చి 2015 (10:30 IST)
టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రక చిత్రం 'రుద్రమదేవి'లో హీరో అనుష్కనేనని హీరో దగ్గుబాటి రానా అన్నాడు. విశాఖలో జరిగిన చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన రానా సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ, అనుష్క నటనను ఆకాశానికెత్తేశాడు. సంగీత దిగ్గజం ఇళయరాజా, సంచలన దర్శకుడు గుణశేఖర్‌ల పేర్లు ఉన్న వాల్ పోస్టర్‌లో తన ఫొటో ఉన్నందుకు గర్వంగా ఉందని కూడా రానా వ్యాఖ్యానించాడు.
 
అలాగే, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ‘రాముడు, కృష్ణుడి పాత్రల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు నటిస్తే, ఆ దేవుళ్లు ఇలా ఉంటారనుకున్నాం. దుర్యోధనుడి పాత్రలోనూ ఆయన జీవించారు. ఏ పాత్రలో నటించినా, ఆ పాత్రకు ఎన్టీఆర్ జీవం పోశారు’ అని గుర్తు చేశారు. రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్, తన సొంతూరు నర్సీపట్నంకు చెందినవారన్నారు. భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన రావాలని ఆయన ఆకాంక్షించారు. 
 
కాగా, టాలీవుడ్ అగ్రనటి అనుష్క ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సంచలన చిత్రం ‘రుద్రమదేవి’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ విశాఖలో అట్టహాసంగా జరిగింది. సినీ దిగ్గజాలు హాజరైన ఈ కార్యక్రమానికి అనుష్కతో పాటు చిత్రంలోని నటీనటులు కూడా హాజరయ్యారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు దగ్గుబాటి రానా కీలక పాత్రలు పోషించారు. అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర చిత్రానికే హైలెట్‌గా నిలువనుందని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu