Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆనందంతో రేపు ఎన్టీఆర్‌ 'రభస' శుభం సీన్‌

Advertiesment
NTR Rabhasa movie shooting
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా 'కందిరీగ' ఫేం సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో యువనిర్మాత బెల్లంకొండ గణేష్‌ బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న 'రభస' స్విట్జర్లాండ్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది.
 
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ - ''నిన్నటితో మా 'రభస' చిత్రం స్విట్జర్లాండ్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకొని ఈ రోజు యూనిట్‌ వచ్చిన వెంటనే మా హీరో ఎన్టీఆర్‌కు కొడుకు పుట్టాడన్న శుభవార్త తెలిసింది. రేపు చిత్రంలోని అందరు ఆర్టిస్టులు పాల్గొనే శుభం షాట్‌ తీస్తాం. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. ఓ పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్‌, డబ్బింగ్‌ వంటి కార్యక్రమాలు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి.
 
ఆగస్ట్‌ 1న సినీ ప్రముఖులు, ఎన్టీఆర్‌ అభిమానుల సమక్షంలో ఈ చిత్రం ఆడియోను వైభవంగా విడుదల చేయబోతున్నాం. ఈ చిత్రానికి థమన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ అందించాడు'' అన్నారు.
 
దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ - ''యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మా 'రభస' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అందర్నీ అలరించే విధంగా థమన్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. ఇందులో ఎన్టీఆర్‌ పాట పాడడం విశేషం. ఈ పాట సినిమాకి ఓ స్పెషల్‌ హైలైట్‌ అవుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ చేసిన డాన్స్‌ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది. ఎన్టీఆర్‌, థమన్‌ కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌గా ఈ చిత్రం నిలుస్తుంది'' అన్నారు. 
 
ఎన్టీఆర్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్‌. బ్రహ్మానందం, ఆలీ, బ్రహ్మాజీ, నాజర్‌, జయసుధ, సీత, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, అజయ్‌, నాగినీడు, శ్రావణ్‌, భరత్‌, రవిప్రకాష్‌, ప్రభాకర్‌, సురేఖావాణి, ప్రగతి, సత్యకృష్ణ, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ప్రేమ్‌రక్షిత్‌, శేఖర్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌,  ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకటరత్నం(వెంకట్‌),

Share this Story:

Follow Webdunia telugu