Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రపోరి కాంటెస్ట్ ఆరంభం... ఏప్రిల్ 25న ఆడియో రిలీజ్..!

Advertiesment
Andhra Pori
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఆంధ్రాపోరి. ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్నిమిస్తున్న ఈ సినిమాకు ఋషి సినిమా ఫేం రాజ్ మాదిరాజ్ దర్శకత్వం వహించారు. 
 
ఈ చిత్రంలో ఈ యంగ్ హీరో సరసన ఉల్కా గుప్తా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుపుతోంది. ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు సినీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
 
ఈ చిత్ర ప్రమోషన్ వర్క్‌లో భాగంగా ఆంధ్రపోరి కాంటెస్ట్‌ను ప్రారంభించింది. ఏప్రిల్ ఆరో తేది ప్రారంభమైన ఈ కాంట్రెస్ట్‌లో ప్రతి రోజు సినిమాకు సంబంధించిన కాంటెస్ట్ పెడుతూ వారికి బహుమతులు ఇవ్వనున్నది. ఈ కాంటెస్ట్ లో గెలిచిన విజేతలకి సినిమా యూనిట్ ఆడియో విడుదలకి పాసులతోపాటు ప్రత్యేక బహుమతులు అందజేయనుంది.

Share this Story:

Follow Webdunia telugu