అవును... యాంకర్ సుమ కిడ్నాప్‌కు గురైనట్లు ప్రకటించింది. ఇంట్లో వున్న తనను వేరే ప్రోగ్రామ్‌కు వెళుతుండగా షడెన్‌గా... ఆమె భర్త రాజీవ్ కనకాల ఓ కార్యక్రమానికి బలవంతంగా తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ఆమె సరదాగా చెప్పింది. కుందనపు బొమ్మ అనే చిత్రం ఫస్ట్‌లుక్‌కు ఆమెతోపాటు రాజీవ్ కనకాల, సుమను చాలా మర్యాదగా, గౌరవంగా ఆహ్వానించారు.
దాంతో... ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి గౌరవం ఇంట్లో ఇస్తే ఎంతో బాగుండు. ఇలా రోజూ ఓ ఫంక్షన్ జరిగితే నా గౌరవం పెరుగుతుందంటూ... ఇక్కడికి నేను మామూలుగా రాలేదు. కిడ్నాప్ చేసి తీసుకువచ్చారంటూ... అందరినీ నవ్వుల్తో ముంచెత్తించింది. యాంకర్ల సమయస్ఫూర్తి అంటే అదేమరి.