Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆగడు' పాటలు సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి...

Advertiesment
Aagadu songs super hit
, గురువారం, 4 సెప్టెంబరు 2014 (18:55 IST)
గతంలో లహరి మ్యూజిక్‌ ద్వారా ఎన్నో సూపర్‌హిట్‌ ఆడియోలు రిలీజ్‌ అయిన విషయం తెలిసిందే. కొంత గ్యాప్‌ తర్వాత మళ్ళీ ఈ ఏడాది '1'(నేనొక్కడినే), 'లెజెండ్‌', 'రేసుగుర్రం', 'దృశ్యం' వంటి సూపర్‌హిట్‌ ఆడియోలతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. తాజాగా మహేష్‌ 'ఆగడు' ఆడియోను లహరి విడుదల చేసింది. ఈ ఆడియో విడుదలైన రోజునుంచే సేల్స్‌పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
 
ఈ సందర్భంగా లహరి మ్యూజిక్‌ అధినేత మనోహర్‌నాయుడు మాట్లాడుతూ - ''ఈ సంవత్సరం మా సంస్థ విడుదల చేసిన ఆడియోలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. లేటెస్ట్‌గా మహేష్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ నిర్మిస్తున్న 'ఆగడు' ఆడియో ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. థమన్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలూ ఆదరణ పొందుతున్నాయి. 
 
'ఆగడు' టైటిల్‌ సాంగ్‌, 'నారి నారి..', 'జంక్షన్‌లో..', 'తు ఆజా సరోజా..' పాటలు శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సంవత్సరం థమన్‌ చేసిన ఆడియోల్లో 'ఆగడు' ది బెస్ట్‌ ఆడియోగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. సేల్స్‌ పరంగా ఈ ఆడియో కొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్ని ఏరియాల నుంచి రిపోర్ట్స్‌ వస్తున్నాయి. అలాగే డిజిటల్‌గా కూడా చాలా హై రేంజ్‌లో డౌన్‌లోడ్స్‌ జరుగుతున్నాయి. 
 
వరసగా మూడు చిత్రాల ఆడియోలు మా లహరి ద్వారా విడుదల చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు రామ్‌, గోపీ, అనీల్‌లకు మరియు కొర్రపాటి సాయి,  'ఆగడు' దర్శకుడు శ్రీను వైట్లకు, సంగీత దర్శకుడు థమన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా సంస్థ ద్వారా త్వరలో మల్టీస్టారర్‌ 'గోపాల గోపాల', మరో భారీ బడ్జెట్‌ చిత్రం ఆడియోలు విడుదల కాబోతున్నాయి'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu