Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

16న "16డేస్" ఆడియో విడుదల

Advertiesment
వినోదం వెండితెర కథనాలు ఛార్మీ అరవింద్ ప్రభుసాల్మన్ దర్శకత్వం కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం డివైచౌదరి పి మహేష్ బాబు
ఛార్మీ, అరవింద్ జంటగా ప్రభుసాల్మన్ దర్శకత్వంలో కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వై.చౌదరి, పి. మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం "16 డేస్". తమిళంలో "లాడం" పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో మార్కెట్లోకి విడుదల కాగా, తెలుగు వెర్షన్ ఈ నెల 16వతేదీన రిలీజ్ కానుంది.

సోనీ బిఎంజి ఆడియో ద్వారా 16 డేస్ ఆడియో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, తమిళ నేపథ్యమయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.

చనిపోయిన తర్వాత ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా కార్యక్రమాలు జరుపుతారని, అలా ఈ కార్యక్రమం లోపల ఓ సంఘటన జరుగుతుందని... అది ఏమిటి? అనేదే చిత్రంలోని పాయింట్ అని ప్రభు సాల్మన్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu