Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరవేగంగా "స్వామి సత్యానంద" షూటింగ్

Advertiesment
స్వామి సత్యానంద
, సోమవారం, 10 అక్టోబరు 2011 (12:34 IST)
WD
మారుతీ ఆర్ట్ ఫిల్మ్స్ "స్వామి సత్యానంద" చిత్రం హాస్య సన్నివేశాలను ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గౌతం రాజు, చిత్రం శ్రీను, కవిత మల్లేష్ యాదవ్‌ల‌పై ఇటీవల చిత్రీకరించగా, నిజాంపేట్‌లోని జామతోటలో విలన్‌పై కొని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. జి.వి.హెచ్.ప్రసాద్ రచించగా రఘు కుంచె గానం చేసిన "అందమైన హై టెక్క్ సిటీ... ఆల్ ఇండియా మెచ్చిన సిటీ... అమెరికాకు నచ్చిన సిటీ.. అందరి సిటీ... ఆశల సిటీ.. అద్భుత సిటీ...", ఆఖరి పాట హైదరాబాద్‌లోని కొన్ని ముఖ్య ప్రదేశాల నేపధ్యంలో చిత్రీకరించారు.

10వ తేదీ నుండి 15 తేదీ లోగా బెంగళూరులోని ఆశ్రమంలో పాట సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తదుపరి చిత్రం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామంటూ నిర్మాత జి.వి.హెచ్.ప్రసాద్ తెలియజేసారు.

రవి చేతన్ కథానాయకుని పాత్రను పోషిస్తుండగా దర్శకుడు మదన్ పటేల్‌తో పాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, జీవా, గుండు హనుమంత రావు, గౌతం రాజు, చిత్రం శ్రీను, బొంబాయి నటి నేహ, ఇటలీ అందాల భామ అలోకి, జయలలిత, కవిత, శ్రద్ధ, విజయ వర్మ, జెమిని ఫణి, జెన్నీ, తిలక్ తదితరులు నటిస్తున్నారు. మాటలు-సాయి కృష్ణ; పాటలు-జి.వి.హెచ్.ప్రసాద్, భారతి బాబు;

ఫోటోగ్రఫి-సుభాష్; ఎడిటింగ్-రాంబాబు; ఆర్ట్- నారాయణ; స్టిల్స్ - రంగా; కొరేయోగ్రఫి-మురళి, మదన్, హరిణి; ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్-నాగి రెడ్డి; నిర్మాతలు-జి.వి.హెచ్.ప్రసాద్, శ్రీమతి లక్ష్మి; సంగీతం, దర్శకత్వం-మదన్ పటేల్

Share this Story:

Follow Webdunia telugu