Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'వీరంగం' ఆడియో విడుదల

'వీరంగం' ఆడియో విడుదల
సుమన్‌, ఆశిష్‌ విద్యార్థి, శ్యామలాదేవి ప్రముఖ పాత్రల్లో నటించిన సినిమా 'వీరంగం'. శివానిఆర్ట్స్‌ బేనర్‌పై బేబి మమత సమర్పణలో గంగ, సమ్మక్క సారక్క చిత్రాలకు దర్శకత్వం వహించిన వేముగంటి దర్శకత్వంలో సిఎల్‌. శ్రీనివాస్‌ యాదవ్‌ నిర్మిస్తున్నారు. సినిమా ఆడియో విడుదలైంది. రాత్రి ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో డా|| డి. రామానాయుడు ఆడియోను ఆవిష్కరించగా అచ్చిరెడ్డి తొలి సీడీనిఅందుకున్నారు.

ఈ సందర్భంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ, పాటలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. చక్కటి మ్యూజిక్‌ కుదిరింది. నిర్మాత శ్రీనివాసయాద్‌ సామాజిక బాధ్యతగా ఫీలయి జోగిని వ్యవస్థపై సినిమా నిర్మించడం చాలా ఆనందం. ఇటువంటి సినిమా ఎవ్వరూచేయలేరు. అందుకే ఆయన్ను అభినందిస్తున్నాను అన్నారు.

కవిత మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో కొన్నేళ్ళుగా జోగిని వ్యవస్థ ఒక దురాచరంగా ఉంది. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌ తీసుకుని సినిమా తీసినందుకు అభినందిస్తున్నాను అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ నందన్‌రాజ్‌ మాట్లాడుతూ, ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కథాపరంగా పాటలు బాగావచ్చాయి. మంచి స్పందన వస్తుందనే నమ్మకముందని తెలిపారు.

వేముగంటి మాట్లాడుతూ, నేను కథ తయారుచేసుకోగానే శ్రీనివాస్‌ను కలిశాను. కథ చెప్పగానే నచ్చి సినిమా తీయడానికి ముందుకువచ్చారు. 65 రోజులు షూటింగ్‌ జరిగింది. వరంగల్‌, హైదరాబాద్‌, అరకులలో చేశాం. అన్నిచోట్ల మంచి ఆదరణలభించింది. ఈ సినిమాకు ముఖ్యపాత్రధారి శ్యామలాదేవి.

జీ 24గంటలలో ఆమె ప్రోగ్రాం చూసి నవ్వుకు అభిమానినయ్యాను. ఇందులో ఆమె నటన షబానా ఆజ్మీని గుర్తుచేస్తుంది. జోగినిగా తనతో సినిమా తీయాలని కథను తయారుచేసుకున్నాను. మా ప్రయత్నాన్నితెలుగువారు ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

శ్యామలాదేవి మాట్లాడుతూ, సినిమాలంటే పరిచయంలేదు. అలాంటిది నన్ను పెట్టి సినిమా తీశారు. షూటింగ్‌ జరిపిన అన్ని రోజులు వెనిజాల గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు చూశారు. ఈ సినిమాతో నాకు వేము బొమ్మ అని ప్రశంసలువచ్చాయి. సుమన్‌గారితో నటించడం ముందు భయమేసింది. ఆయన చాలా సపోర్ట్‌ చేశారు. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

సుమన్‌ మాట్లాడుతూ, 30 సంవత్సరాల సినీ చరిరతలో ఇది నా 99వసినిమా. ఈ సమయంలో నాకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. వేము కథచెప్పగానే ఓకే చేశాను. నందన్‌రాజ్‌ చక్కటి సంగీతం అందించారు. ఐదు పాటలు బాగున్నాయి. కోట, బాబూమోహన్‌, ఆశిష్‌ నటన అద్భుతంగా ఉంది అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu