Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ఆడియో

Advertiesment
డాక్టర్ రాజేంద్రప్రసాద్
WD
డాక్టర్ రాజేంద్రప్రసాద్, శివాజీ, సోనియా, ఆర్తీ అగర్వాల్, కల్యాణి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం రాత్రి జూబ్లిహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో మాడుగుల నాగఫణిశర్మ, దైవజ్ఞశర్మ, అల్లరి నరేష్, వేణు మాధవ్, గీత రచయిత భాస్కరభట్ల రవి, సంగీత దర్శకురాలు ఎం.ఎం శ్రీలేఖ, సింహా నిర్మాత పరుచూరి ప్రసాద్, హీరో రామ్, అనుష్క, భూమిక దంపతులు, కోన వెంకట్ తదితరులు హాజరయ్యారు. ముందుగా చిత్రంలోని ఒక్కోపాటను ఒక్కో అతిథి విడుదల చేశారు. అనంతరం సీడీని హీరో రామ్ ఆవిష్కరించి భూమిక, అనుష్కలకు సీడీని అందించారు.

నాగఫణి శర్మ మాట్లాడుతూ, సృష్టి, స్థితి, లయలే చిత్ర టైటిల్‌గా విశ్లేషించారు. ఈ చిత్ర కథ తనకు తెలుసుననీ మంచి విజయాన్ని సాధిస్తుందనే విశ్వాసముందని పేర్కొన్నారు. ఇందులో తాను అమ్మపై పాట రాసే అవకాశం కల్గిందనే సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నరేష్ మాట్లాడుతూ... కథ తాను విన్నాననీ, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు. గాయని కౌసల్య మాట్లాడుతూ... ప్రేమించులో కంటేనే కూతురు... అనే పాటను శ్రీలేఖ ఆలపించారు. మళ్లీ ఈ చిత్రంలో అమ్మపై రాసిన పాటను పాడి మెప్పించారు. ఇటువంటి సినిమాలో నేనూ ఓ భాగమైనందుకు ఆనందంగా ఉందని అన్నారు. సినిమాకు టైటిల్ పెట్టిగానీ తాను సినిమా తీయననీ, అదే సినిమాకు సగం బలాన్నిస్తుందనీ, ఈ చిత్రానికి అదే జరిగిందని పరుచూరి ప్రసాద్ వ్యాఖ్యానించారు.

వేణు మాధవ్ తనదైన శైలిలో మాటల చతురతతో అందర్నీ అలరించారు. దర్శకుడు సూర్యకిరణ్ మాట్లాడుతూ... సినిమా హిట్ ఎంత గొప్పదో ఒక్కసారి ఫ్లాప్ అయ్యాకగానీ తెలిసి రాదు. తెలుగు ఇండస్ట్రీలో రెండవ సినిమాకు దర్శకుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మొదటి సినిమా ఎలాగూ విజయవంతమవుతుందని చిత్రదర్శకుడు నాగేశ్వరరావునుద్దేశించి అన్నారు. చిత్రం గురించి చెపుతూ... బ్రహ్మలోకం, యమలోకంపై గతంలో ఓ తమిళ సినిమా వచ్చిందంటూ ఆ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు.

శ్రీలేఖ మాట్లాడుతూ.. సోషియో ఫాంటసీ చిత్రానికి తొలిసారిగా సంగీతాన్ని సమకూర్చాననీ, ఒక్కో పాట ఒక్కో తరహాలో ఉంటుందని అన్నారు. చిత్ర దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ... సినిమా కథ నేపథ్యాన్ని వివరించారు. అందరినీ ఆకట్టుకునేలా చిత్రముంటుందన్నారు. టైటిల్ కు క్రేజ్ ఏర్పడిందని చెప్పారు. ఇంకా భాస్కరభట్ల రవి, చిత్ర నిర్మాతలు రూపేష్, వేణుగోపాల్, రాజా చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

Share this Story:

Follow Webdunia telugu