Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రముఖ హాస్యనటుడు పి. పద్మనాభంకు స్వర్ణకంకణం

ప్రముఖ హాస్యనటుడు పి. పద్మనాభంకు స్వర్ణకంకణం
WD
ప్రముఖ హాస్యనటుడు పి. పద్మనాభంకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్వర్ణకంకణాన్ని తొడిగారు. పద్మశ్రీ డాక్టర్. అల్లురామలింగయ్య పేరిట జాతీయస్థాయి అవార్డును పద్మశ్రీ డా. అల్లురామలింగయ్య కళాపీఠం నిర్వహించింది.

గురువారం జూబ్లిహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుమ్మడి, కె. రాఘవేంద్రారావు, అల్లు అర్డున్ రామ్‌చరణ్‌తేజ, సారిపల్లి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

గుమ్మడి జ్ఞాపికతో సత్కరిస్తే, రాఘవేంద్రరావు, అల్లు అర్జున్, బ్రహ్మానందం ప్రశంసా పత్రంలో పద్మనాభంను గౌరవించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తన కెరీర్‌కు ముగ్గురు వ్యక్తులు కీలకమన్నారు. అందులో తాత ఒకరు. ఆయనపేరిట గల అవార్డు.. ఆయన సమకాలీనుకి దక్కడం గౌరవంగా భావిస్తున్నామన్నారు.

ఈ గౌరవ సత్కారాన్ని అందుకున్న పద్మనాభం మట్లాడుతూ.. మనిషి ఏడుస్తూ పుడతాడు. ఏడుస్తూ మరణిస్తాడు. ఈ మధ్యనుండే జీవితాన్ని మనిషి నవ్వు తూ బతకాలి. నటుడిగా ఆ నవ్వును నలుగురికి పంచే అవకాశం తనకు రావడం వరమన్నారు. ఈ సందర్భంగా "నావూరు మదరాసు.. నా పేరు రామదాసు.." అనే పాట పాడి సభికులను అలరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న "మగధీర" హీరో రామ్‌చరణ్ తేజ మాట్లాడుతూ.. తాతయ్య అందరి సినిమాలు చూశారు. నా సినిమా చూడకుండా వెళ్లిపోయాడు. ఇది తలచుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఈ అవార్డును పద్మనాభంకు అందజేయడం సముచితమన్నారు.

అల్లుఅరవింద్, అల్లు అర్జున్, గుమ్మడి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి చిరంజీవి అభిమానులు భారీగా తరలివచ్చారు. కానీ మెగస్టార్ అస్వస్థత కారణంగా రాకపోవడంతో వారు నిరాశకు గురైయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu