కల్కి ఆశ్రమంలో ఆధ్యాత్మకత ముసుగులో అక్రమ వ్యాపారం వ్యవహారం అలావుండగానే తమిళనాడులో ప్రఖ్యాత స్వామిగా పిలువబడే నిత్యానంద స్వామి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. నిత్యానంద వికృత చేష్టలను తమిళనాడులోని అన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. ఇదిలావుండగా స్వామి రాసలీలల్లో కోలీవుడ్‌కు చెందిన కొందరు తారామణులు కూడా ఉన్నట్లు సమాచారం.
వీడియోలో నిత్యానందతో సరససల్లాపాలు సాగించిన యువతులలో కొందరు సినీ తారలు కూడా ఉన్నట్లు భోగట్టా. ఈ జాబితాలో సన్ టీవీ సీరియళ్లలో మహా బిజీగా నటించే రంజిత పేరు కూడా వినబడుతోంది. అయితే ఈ విషయం ఇంకా నిర్థారణ కాలేదు.
నిత్యానందతో చనువుగా మసలిన ఆ యువతి ముమ్మాటికీ రంజితేననీ తమిళ మీడియా కోడై కూస్తోంది. అన్నట్లు ఈ రంజిత ఎస్వీ కృష్ణారెడ్డి "మావిచిగురు" చిత్రంలో కథానాయకగా నటించింది.