Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోమా నుంచి బయటపడ్డ సి.సి. రెడ్డి

Advertiesment
వినోదం వెండితెర కథనాలు విసు ఫిలింస్ అధినేత రాజకీయ సలహాదారు సిసిరెడ్డి అనారోగ్యం కోమా
, శుక్రవారం, 12 సెప్టెంబరు 2008 (16:14 IST)
విసు ఫిలింస్ అధినేత, రాజకీయ సలహాదారు సి.సి.రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. "మీ శ్రేయోభిలాషి" చిత్రం తర్వాత ఆయన పలు సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యారు. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి నటించిన మూకీ చిత్రం కూడా ఉంది.

కాలి బొటన వేలికి సంబంధించిన "గౌట్" అనే వ్యాధితో సి.సి. రెడ్డి బాధపడుతున్నారు. అది శ్రుతిమించి కేన్సర్‌గా మారే అవకాశాలున్నాయి. ఇది చాలా అరుదుగా వచ్చే జబ్బు. గత రెండు నెలలుగా చిన్నపాటి అస్వస్థగా ఉంటే రెడ్డి మందులతోనే గడిపేశారు. కానీ పథ్యం మాత్రం చేయకపోవడంతో అది తీవ్రరూపం దాల్చింది.

దీంతో ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగా కోమాలోకి వెళ్ళిపోయారు. దాదాపు ఐదురోజుల అనంతరం బయటపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు కుదుటపడ్డారు. దాంతో తాను చేసిన తప్పిదం తెలియవచ్చి, ఇక నుంటి డైటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటానని ప్రమాణం కూడా చేశారు. దాదాపు ఇంకా.. 15 రోజుల వరకు ఆయన బెడ్‌రెస్ట్‌లో ఉండాలని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇంకేముంది... ఆయన త్వరలో కోలుకోవాలని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu