Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంకు హాజరైన ప్రముఖులు వీరే..

Advertiesment
వైఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంకు హాజరైన ప్రముఖులు వీరే..
, గురువారం, 2 సెప్టెంబరు 2021 (22:51 IST)
హైదరాబాద్‌ లో జరిగిన వైఎస్సార్ సంస్మరణ సభకు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారు.

వైఎస్ విజయమ్మ ఆహ్వానం మేరకు మాజీ ఐఏఎస్ లు, మాజీ ఐపీఎస్ లు, కొందరు సీనియర్‌ జర్నలిస్ట్‌లు, పారిశ్రామికవేత్తలు సైతం హైటెక్స్‌కు వచ్చారు. సంస్మరణ సభకు వచ్చిన ప్రతి ఒక్కరిని వైఎస్‌ విజయమ్మ, షర్మిల మర్యాదపూర్వకంగా పలకరించారు.
 
ముఖ్యంగా వైఎస్సార్తో  అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన వాళ్లలో ఏపీ కాంగ్రెస్‌కు చెందిన కేవీపీ రామచందర్‌రావు, రఘువీరారెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్ అటెండ్ అయ్యారు.

తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌ నేతలు గోనె ప్రకాష్, బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్, కంతేటి సత్యనారాయణ రాజు, రామచంద్రమూర్తి, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డితో పాటు శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, డీవీ సత్యనారాయణ, సీనియర్ పాత్రికేయులు. ఏబీకే ప్రసాద్, బండారు శ్రీనివాస్, జంధ్యాల రవి శంకర్, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సంస్మరణ సభకు విచ్చేశారు.

వీళ్లతో పాటు రాజీవ్ త్రివేది, గిరీష్ సంగ్వి , నవయుగ సీవీ రావు, ఏపీ జితేందర్ రెడ్డి, బ్రదర్ అనీల్‌కుమార్‌ సభకు విచ్చేశారు.

కాంగ్రెస్‌ నేతలు ఎవరూ వెళ్లొద్దని ఇప్పటికే టీపీసీసీ స్పష్టం చేసినప్పటికి .. కొందరు కాంగ్రెస్‌ నేతలు సభకు హాజరయ్యారు. వెళితే తప్పేంటని కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ‌గ‌న్‌ను కలిసిన గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి