బ్రిటన్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన 35 యేళ్ళ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆమెకు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో ఈ విషయం తేలింది.
ఎట్-రిస్క్ దేశాల జాబితాలో బ్రిటన్ దేశం ఒకటి. ఇక్కడకు వెళ్లి వచ్చిన ఆ మహిళ ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆమెకు ఎయిర్‌పోర్టులో నిర్వహించిన పరీక్షలో కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆమెను తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టీఐఎంఎస్)లో ఆడ్మిట్ చేశారు.
ఆమె శాంపిల్స్‌ను జెనెటిక్ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఈ బాధితురాలు రంగారెడ్డికు చెందిన మహిళగా గుర్తించారు. ఈమె బంధువులకు కూడా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది.